Published On:

Manchu Vishnu: అందుకే జనరేటర్‌లో చక్కెర పోశా, అభిమాని ప్రశ్నకు మంచు విష్ణు రియాక్షన్‌!

Manchu Vishnu: అందుకే జనరేటర్‌లో చక్కెర పోశా, అభిమాని ప్రశ్నకు మంచు విష్ణు రియాక్షన్‌!

Manchu Vishnu Chitchat With Fans on X: ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆయన డ్రీం ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ చిత్రం నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ కూడా మరింత హైప్‌ పెంచుతోంది.

ఆస్క్ విష్ణు(#AskVishnu)

తరచూ ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ మూవీపై బజ్‌ క్రియేట్‌ చేస్తోంది కన్నప్ప టీం. ఇప్పటికే ఈచిత్రంలో పాత్రలను పరిచయం చేశారు. అలాగే ఫస్ట్‌ సింగిల్‌ పేరుతో శివ శివ అనే పాటను రిలీజ్‌ చేయగా దీనికి విశేష స్పందన వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌ కూడా స్టార్ చేశారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తాజాగా ఎక్స్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్‌విష్ణు(#Askvishnu) పేరుతో ఎక్స్‌ వేదికగా చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్ల నుంచి విష్ణుకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

హిందీ రాదేంట్రా..?

ముఖ్యంగా వారి ఫ్యామిలీలో నెలకొన్న వివాదంపై కూడా కొందరు విష్ణును ప్రశ్నించారు. జనరేటర్‌లో చక్కెర వివాదంలో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్న విష్ణు ఇచ్చిన సమాధానం హాట్‌టాపిక్‌ మారింది. కాగా ఆస్క్‌విష్ణు పేరుతో నిర్వహించిన ఈ చిట్‌చాట్‌లో ఓ నెటిజన్‌.. ‘సర్‌ కన్నప్పలో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌లు ఒకే ఫ్రేంలో కనిపిస్తారా?’ అని ఓ అభిమాని హిందీలో ప్రశ్నించారు. దీనికి విష్ణు ఓ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. కన్ను కొడుతున్న ఎమోజీతో అవునను అన్నట్టు హింట్‌ ఇచ్చాడు. విష్ణు ఇచ్చిన సమాధానానికి ఓ నెటిజన్‌ అసహనం చూపించాడు. హిందీ రాదేంట్రా నీకు రిప్లూ ఇవ్వకుండ ఏదేదో పెడుతున్నావ్‌ అంటూ ఘాటుగా స్పందించాడు. దీనికి విష్ణు స్పందిస్తూ.. మేరీ జాన్‌, మేర హిందీ ఒకేఒకే(Meeri Jaan, Mera Hindi OK Ok) కూల్‌గా సమాధానం ఇచ్చాడు. నెటిజన్‌ ఏరా అంటూ ఘాటుగా అడిగిన విష్ణు మాత్రం కూల్‌గా స్పందించి అతడి దిమ్మతిరిగేలా చేశాడు.

జనరేటర్ లో చక్కెర ఎందుకు పోశావ్?

విష్ణు తీరుకు ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్‌ సైతం ప్రస్తావించాడు. “రా అన్న కూడా ఇంత మంచిగా రిప్లై ఇచ్చిన మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్‌లో చక్కెర ఎందుకు వెశావ్‌ భాయ్‌” అని ప్రశ్నించాడు. దీనికి సైతం విష్ణు స్పందిస్తూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఫుయెల్‌లో చక్కెర వేస్తే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్‌లో చదివాను అంటూ కాస్తా చమత్కారించారు. విష్ణు సమాధానికి ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌ మారింది. అంటే జనరేటర్‌లో విష్ణు చక్కెర వేశాడని ఒప్పుకున్నట్టేనా? అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.