Published On:

Pakistan: పాకిస్థాన్ ను ట్రోల్ చేస్తున్న సొంత ప్రజలు

Pakistan: పాకిస్థాన్ ను ట్రోల్ చేస్తున్న సొంత ప్రజలు

Pakistan: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఘటనలో 26మంది పర్యాటకులు మృతిచెందారు. పాకిస్థాన్ ఆర్మీచీఫ్ ను లాడెన్ గా పోల్చారు అమెరికా పెంటగాన్ మాజీ అధికారి.  ఆదేశాన్ని తీవ్రవాదులను తయారుచేస్తున్న దేశంగా ప్రకటించాలన్నారు.

పాకిస్థాన్ ప్రధాని షెహనవాజ్  మాట్లాడుతూ భారత్ ను ఎదుర్కునేందుకు, తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు. పాకిస్థాన్ పౌరులు మాత్రం వారి దేశాన్ని, ఆర్థిక పరిస్థితిని ట్రోల్ చేస్తున్నారు. నిరాశ వ్యంగ్యంతో కూడిన మీమ్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ తన ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం ఎలా విఫలమైందో ఎత్తిచూపుతున్నారు.

 

పాకిస్థానీలు వారి దేశ ఆర్థిక పరిస్థితిని గర్తుచేస్తూ మీమ్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ తో భారత్ యుద్దం చేయాలనుకుంటే తొమ్మిది గంటల ముందే ముగించాలని సూచించారు. ఎందుకంటే ఆతర్వాత పాకిస్థాన్ లో కరెంటు నిలిపివేస్తారట.

తిండి, నీరు, గ్యాస్ లేని పేద దేశంతొ పోరాడుతున్నారని భారతదేశం తెలుసుకోవాలన్నారు.

 

పాకిస్థాన్ వైమానిక దళాన్ని ట్రోల్ చేసిన ఒక యూజర్, పేపర్ జెట్ లాంటి వాటితో భారత్ ను ఎదుర్కోవాలని సూచించాడు.

 

ఒక యూజర్ స్నానం చేస్తున్న ఫొటోను రిలీజ్ చేస్తూ నీళ్లు ఆగిపోయాయి భారత్ ను కొంచె సింధూ జలాలను విడవమని చెప్పండని పోస్ట్ చేశాడు.

Pakistan Government Mocked By Own Citizens

Pakistan Government Mocked By Own Citizens

భారత్ పాకిస్థాన్ పై దాడిచేసి చంపాలనుకుంటుందా.. ఇప్పటికే మాప్రభుత్వం రోజూ చంపుతోంది. బహుషా మీరు లాహోర్ ను తీసుకోవాలనుకుంటున్నారా? దాన్ని చూస్తే మీరు అరగంటలో వెనక్కి ఇచ్చేస్తారు అని పాకిస్థానీలు వాళ్ల దేశ ఆర్థికస్థితిపై మీమ్స్ చేశారు.

 

పహల్గాం ఉగ్రదాడిపై ఇప్పటికే భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకొంది. ఈ దాడిలో పాల్గొన్నవారు పాకిస్థాన్ పౌరులు కాగా మరికొందరు అక్కడే ట్రైనింగ్ తీసుకుని వచ్చారు. దాంతో పాటే.. పాక్ ఆర్మీ చీఫ్ గత వారం ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కాశ్మీర్ ఎప్పటికీ పాక్ లో భాగమేనని అందుకు పోరాటం చేస్తున్న కాశ్మీరీ అన్నదమ్ములను మనం అక్కున చేర్చుకోవాలని  వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత వారానికే పహల్గాంలో దాడి జరిగింది.