IPL 2025: పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా ఢీ.. ఒత్తిడిలో నైట్‌రైడర్స్

Kolkata Knight Riders vs Punjab Kings: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ 44వ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ సీజన్‌లో తలపడగా.. పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3 మ్యాచ్‌లు గెలుపొందగా.. మిగతా 5 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక, పంజాబ్ కింగ్స్ కూడా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 3 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.
అయితే, గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు శ్రేయర్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ అందించాడు. కానీ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం చెందుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో గెలుపొందాల్సి ఉంటుంది.
ఇక, కోల్‌కతా జట్టుతో పోల్చితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలోనూ బలంగా కనిపిస్తోంది. ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చక్కగా ఆడుతున్నాడు. బౌలింగ్‌లోనూ పేసర్లతో పాటు స్పిన్ మాయాజాలం పనిచేస్తోంది.
జట్టు అంచనా..
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్0, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్ లెట్, అర్ష్ దీప్ సింగ్, యుజేంద్ర చాహల్, హర్ ప్రీత్ బ్రార్.
కోల్‌కతా నైట్‌రైడర్స్: రహమనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే(కెప్టెన్), రఘువంశీ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా.
ఇవి కూడా చదవండి:
- Sourav Ganguly : పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లే వద్దు : భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు