Published On:

Hyderabad : రేపటిలోగా వెళ్లిపోండి.. నలుగురు పాకిస్థానీయులకు నోటీసులు

Hyderabad : రేపటిలోగా వెళ్లిపోండి.. నలుగురు పాకిస్థానీయులకు నోటీసులు

Hyderabad police issue notices to four Pakistanis : జమ్ముకశ్మీర్‌‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే పాక్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో ఉన్న పాకిస్థాన్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశాడు. రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను తక్షణమే గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. వారి డేటాను కేంద్రానికి పంపితే వారి వీసాల రద్దు చేస్తామని పేర్కొన్నారు.

 

హైదరాబాద్‌‌లో 213 మంది పాకిస్థానీయులు..
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న పాక్ పౌరులపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం నగరంలో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు నోటీసులు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసా హోల్డర్లుగా గుర్తించారు. రేపటిలోగా నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌‌లో 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లుగా లెక్క తేలింది. అందులో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారు 209 మంది ఉన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మాత్రం కేంద్రం మినహాయింపు ఇచ్చింది.

 

 

ఇవి కూడా చదవండి: