Last Updated:

Kareena Kapoor: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి – కరీనా కపూర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Kareena Kapoor: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి – కరీనా కపూర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Kareena Kapoor Emotional Post: బాలీవుడ్‌ నటుడు సైప్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన కత్తి దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో సైఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్‌పై జరిగిన దాడి ఘటపై ఆయన భార్య, నటి కరీనా కపూర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ షేర్‌ చేశారు. గురువారం (జనవరి 16) తమకు కఠినమైన రోజు అన్నారు.

“మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. అసలు ఏలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటి సమయంలో మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే మీడియా వర్గాలకు మా విన్నపం ఒక్కటే. దీనిపై ఎలాంటి ఊహజనిత కథనాలు కానీ, కవరేజీలు కానీ చేయకుండ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మాపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత కఠినంగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ క్లిష్టసమయంలో మా కుటుంబానికి వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది.

కాగా జవనరి 16 గురువారం తెల్లవారు జామును ఉదయం 2:30 గంటల సమయంలో సైఫ్‌పై నిందితుడు దాడి చేసినట్టు తెలుస్తోంది. అందరు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడి దుండగుడు చోరీకి యత్నించాడు. మొదట వారి చిన్నకుమారు జహంగీర్‌ గదిలో ప్రవేశించాడు. అతడి చూసిన కేర్‌ టేకర్‌ కేకలు వేయగా ఆమెపై కత్తితో దాడి చేసి బంధించాడు. అలికిడి అక్కడి చేరుకున్న సైఫ్‌ దుండగుడిని ఎదరించే ప్రయత్నం చేశాడు. దీంతో దొంగ విచక్షనరహితంగా సైఫ్‌పై కత్తితో దాడి చేసిన అక్కడ నుంచి పరారయ్యాడు. మెట్ల నుంచి పారిపోతున్న నిందితుడు దృశ్యాలు అపార్టుమెంట్‌ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం బాంద్రా పోలీసుల నిందితుడు కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: