IPL 2025: కోల్‌కతాతో కీలక మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పంజాబ్

Punjab Kings vs Kolkata Knight Riders, Punjab Kings batting: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కాసేపట్లో 44వ మ్యాచ్ జరగనుంది. తొలుత పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 8 మ్యాచ్‌లు చొప్పున ఆడాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, కోల్‌కతా ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లే గెలిచింది. ఇంకా 6 మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా 5 మ్యాచ్‌లె గెలిస్తేనే ప్లే ఆప్స్ చేరేందుకు అవకాశం ఉంటుంది.
కోల్‌కతా: రహమన్ గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అండ్రీ రస్సెల్, రోవ్ మన్ పావెల్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి.
పంజాబ్: ప్రియాంశ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, అర్షదీప్ సింగ్, యుజేంద్ర చాహల్.