Cobra Drinking Palm Wine: ఎండాకాలం దాహం తట్టుకోలేక ఈత కల్లు లాగిస్తున్న కోబ్రా!

Cobra Drinking Toddy: సాధారణంగా మనం పాము పేరు వినగానే గుండెల్లో ఆందోళన కలుగుతుంది. కాళ్లు, చేతులు వణికిపోతాయి. ఒకవేళ పాము కనిపిస్తే మాత్రం అక్కడి నుంచి పరుగో పరుగు. కొందరు ఎలాగైనా ఆ పాములను చంపాలని చూస్తుంటారు. భూమి మీద జీవించే సరిసృపాల్లో పాములు కూడా ఒకటి. కొన్ని భూమిపై నివసిస్తే , మరికొన్ని నీటిలో బతుకుతుంటాయి. భూమిపై నివసించే అన్ని పాములు విషపూరితమైనవి కావు. వీటిలో కొన్ని విషం లేని పాములు కూడా ఉంటాయి. కానీ సముద్రంలో జీవించే పాములు మాత్రం అత్యంత విషపూరితమైనవి. మనదేశంలో మాత్రం అత్యంత విషపూరితమైన పాములుగా కింగ్ కోబ్రాకు పేరుంది. నిజానికి పాములు రైతులకు మేలు చేస్తాయి. పొలాలు, గ్రామీణ ప్రాంతాల్లో, అడవుల్లో తిరుగుతుంటాయి. ఎలుకలను, కప్పలను ఆహారంగా తింటాయి. దీంతో రైతులకు మేలు జరుగుతుంది. అలాగే మనదేశంలో పాములను దేవతలుగా కూడా పూజించడం సాంప్రదాయం. దీనిని బట్టి విషపూరిత జీవులైనా వాటిని జీవించేలా చేయాలనేది మన వేదాల సారాంశం.
కొందరు పాముల పేరు చెప్తేనే భయపడిపోతుండగా.. మరికొందరు వాటితో స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ ఎంతైనా అది పాము అండీ. దానీతో కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ఏమాత్రం అటు ఇటు ఐనా ప్రాణాలమీదకి రావడం ఖాయం. అయితే కొందరు పాములతో ఎన్నో వీడియోలను తీసి వాటిని పబ్లిక్ తో పంచుకుంటారు. కొందరు వీటిపై పాజిటీవ్ గా రిప్లై ఇస్తే.. మరికొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి తెగ వైరల్ అవుతోంది. జనవాసాల్లో సంచారం చేస్తున్న ఈ పాము చేసిన పనికి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
సహజంగా పాములు ఆహారం కోసం చెట్లు, గోడలు వంటివి ఎక్కుతుంటాయి. వాటికి కావల్సిన ఆహారాన్ని దక్కించుకుంటాయి. అయితే ఈ కింగ్ కోబ్రా మాత్రం కొంత డిఫరెంట్ గా ఉంది. ఆకలేసిందో.. లేక దాహమేసిందో.. లేదా రోజు రొటీన్ ఫుడ్ తిని బోర్ కొట్టిందో.. సరదాగా ఈత చెట్టు ఎక్కేసింది. అలాగని ఊరుకోకుండా ఈత కల్లు కోసం ఏర్పాటు చేసిన కుండకు చల్లగా చుట్టుకుంది. ఈత కల్లు వాసనతో మైకం కమ్మిందో, లేకా ఈత కల్లు టేస్ట్ నచ్చిందో ఏమో.. తెలియదు కానీ హ్యాపీగా ఈత కల్లు లాగించేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది.