Bird vs Snake fightiing: పాముకు చమటలు పట్టించిన పక్షి.. వీడియో వైరల్

Bird vs Snake fightiing Video viral: ప్రపంచంలో విషపూరితమైన జాతుల్లో పాములు ఒకటి. అయితే ఈ పాముల్లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో విషపూరితమైనవితో పాటు విషం లేని పాములు కూడా ఉంటాయి. అయితే మనం కొన్ని జాతులను మాత్రమే గుర్తించగలం. మరికొన్ని ఎంతవరకు ప్రమాదం అనే విషయం ఇప్పటికీ తెలియదు. అందుకు పాములు చాలా ప్రమాదకరమైనవి అనే ఆలోచనలో అందరిలోనూ ఉంటుంది. అయితే ఓ పక్షి, పాము భీకరంగా పొడుచుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓ పక్షి, పాము కొట్టుకుంటున్నాయి. తన పై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. పక్షి ఆ పామును ముప్పు తిప్పలు పెడుతోంది. ముక్కుతో అటాక్ చేయసాగింది. ఈ వీడియో చూస్తున్నసేపు భయంకరమైన వాతావరణం నెలకొంది. పక్షి, పాము రెండు చాలా సేపు కొట్టుకున్నాయి. పాము కరిచేందుకు ప్రయత్నించగా.. పక్షి మాత్రం దాడి చేస్తూనే ఉంది.
ఈ వీడియోను @GiaitriNongNghiepTV యూట్యూబర్ షేర్ చేయగా యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబోయ్. పామును పక్షి చంపడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఎంత పెద్దగా ఉన్నామన్నది కాదు బాబాయ్.. మనలో మ్యాటర్ ఎంత ఉందనేదే ముఖ్యమని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఏడాది క్రితమే అప్ లోడ్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 86వేల మంది లైక్స్ ఇచ్చారు. ఇక, ఏకంగా 19లక్షల మంది ఈ వీడియో పదే పదే వీక్షించారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ వీడియోను ఓ లుక్ వేసేయండి.