‘Nagamani’ on Cobra Head: కింగ్ కోబ్రాపై బ్లూ కలర్ నాగమణి.. చూస్తే షాక్ కావాల్సిందే

‘Nagamani’ on Cobra’s Head Video got Viral: కింగ్ కోబ్రా చాలా తెలివైన జాతికి చెందినవి. ఇవి భారీగా పెరుగుతాయి. అయితే ఇందులో కింగ్ కోబ్రా పాములు చాలా ప్రత్యేకం. భారత్లోనే కాదు.. ప్రపంచంలోనే శక్తిగల పాములలో ఇది ఒకటి. ఇందులో ఉండే విషం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దీనిలో ఉండే విషం ఏనుగును సైతం చంపేంతా ఉంటుందట.
అయితే, కింగ్ కోబ్రాలను నాగుపాము కూడా అంటారు. ఇలాంటి నాగుపాముల తలలో నాగమణి ఉంటుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. వీటిని కొంతమంది రత్నాలుగా సేకరిస్తారు. వీటికి అధిక శక్తి ఉంటుందని పురాణ కథల్లో వివరించారు. అలాగే దీనిని ధరించి ఎక్కడికైనా వెళ్తే అనుకున్న పనులు సక్సెస్ అవుతాయని కూడా చెప్పారు.
కాగా, స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు కొన్ని వర్షపు చినుకులు ఈ కింగ్ కోబ్రాలోకి వెళ్లినప్పుడు ఆ బిందువులు నాగమణిగా తయారవుతాయాని మరికొంతమంది వాదిస్తున్నారు. ప్రధానంగా ఈ నాగమణి.. పాము పడగలోనే ఏర్పడుతుందని నమ్ముతారు. శివుడి అనుగ్రహం ద్వారానే ఈ నాగమణి ఏర్పడుతుందని, దీనిపై నిరంతరం శివుడి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు.
గతంలో రాజులు నాగమణిని ధరించేవారని చెబుతారు. రాజులు ధరించడంతో ఆ రాజ్యంలో వర్షాలు బాగా పడి పంటలు అనుకున్న దాని కంటే ఎక్కువగా పండేవంట. అంతేకాకుండా ఈ నాగమణి అనేక రంగుల్లో ఉంటుందని, నీలి రంగు, ఆకుపచ్చ, ఎరుపు ఇలా చాలా రంగుల్లో లభిస్తుంది రాసి ఉంది.
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. @The_king_MakrATPfriends యూట్యూబ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నాగుపాము తలపై నీలిరంగులో నాగమణి ఉండడాన్ని చూడవచ్చు. ఈ పామును పట్టుకునేందుకు వెళ్తే.. కాటు వేసేందుకు వెనకాడడం లేదు. ప్రస్తుతం ఈ వీడియోను కొంతమంది ఫేక్ అంటుండగా. .మరికొంతమంది నిజమేనని నమ్ముతున్నారు. ఏదీ ఏమైనా ఈ వీడియోను వేలల్లో చూస్తున్నారు.