Published On:

King Cobra Watching TV: అలా ఎలా కుదిరింది సామీ..? కింగ్ కోబ్రాతోనే టీవీ చూడటమా..? నేనెపుడు సూడలే..!

King Cobra Watching TV: అలా ఎలా కుదిరింది సామీ..? కింగ్ కోబ్రాతోనే టీవీ చూడటమా..? నేనెపుడు సూడలే..!

Giant King Cobra Watching TV: వరల్డ్ వైడ్‌గా పాములు అనేక జాతులు ఉంటాయి. పాముల్లో సుమారుగా 2వేలకు పైగా జాతులు ఉన్నట్లు పాములను అధ్యయనం చేసే కొంతమంది ప్రముఖులు చెబుతుంటారు. ఇందులో విషపూరితమైనవితో పాటు విషం లేని పాములు కూడా ఉంటాయి. ఎక్కువగా విషం ఉండేవి మాత్రమే కింగ్ కోబ్రాలే. ప్రపంచంలోనే అత్యంత విషం ఉన్న సర్పాలుగా వీటికి ప్రత్యేకత ఉంది. ఇలాంటి కింగ్ కోబ్రాలను చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే.

 

అయితే కొంతమంది ఏకంగా పాములతోనే కాదు.. కింగ్ కోబ్రాలతోనూ ఆడుకోవడం చేస్తుంటారు. కొంతమంది ఏకంగా పాములను అమాంతం పట్టుకుంటారు. ఇక, స్నేక్ స్నాచర్‌ల విషయానికొస్తే.. పాములు ఉన్నాయని సమాచారం ఇస్తే.. ఎక్కడికైనా వెళ్లి పాములను పట్టుకుంటున్నారు. ఆ తర్వాత అడవిలో వదిలేస్తున్నారు. ఇక, మరికొంతమంది పాములతో కలిసి సయ్యాటలు ఆడేందుకు సైతం వెనుకడుగు వేయడం లేదు. ఇటీవల కింగ్ కోబ్రాలకు ముద్దులు పెట్టడం వంటి వీడియోలు యూట్యూబ్‌లో షేర్ చేయగా అవి కూడా వైరల్ అవుతున్నాయి తాజాగా, ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడు.. కింగ్ కోబ్రాతో కలిసి ఏంచక్కా ఇంట్లో టీవీ చూడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 

ఈ వీడియోలో ఆ యువకుడు కుర్చీలో కూర్చోగా.. కింగ్ కోబ్రాకు టేబుల్‌పై పడగ విప్పి టీవీ చూస్తుంది. ఆ వ్యక్తి కూడా కింగ్ కోబ్రాతో కలిసి టీవీ చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో ViralHog యూట్యూబర్ షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లు చేస్తున్నారు. ఏంటి బ్రో.. అలా ఎలా కుదిరింది. అని కామెంట్లు చేయగా.. నువ్వు తోపు భయ్యా అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు. కానీ తెగ వైరల్ అవుతోంది. ఏదీ ఏమైనా భయ్యా. నిన్ను మెచ్చుకోవాల్సిందేనని సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.