Giant Anaconda: ఏందీ భయ్యా.. అతి పెద్ద అనకొండను అలా ఎలా పట్టేశావ్?

Giant Anaconda in Fishing Boat Amazon River: ప్రపంచంలోనే భయంకరమైన వాటిలో అనుకొండ ఒకటి. ఎందుకంటే పాము జాతిలో భారీగా ఉండే విషం లేని సర్పానికి చెందినది. కానీ ఈ భారీ సర్పం ఎంతటి మనిషినైనా అమాంతం మింగేస్తుంది. ఈ జాతికి చెందిన సర్పాలు ఎక్కువగా అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి. అంతేకాకుండా ఇందులో చాలా జాతులు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ఎన్నడూ చూడని అనకొండ జాతులు ఆమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో కనిపించాయని చెప్పారు.
ఈ వీడియోలో ఏకంగా ఓ భారీ అనుకొండను పడవలో బంధించారు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ ఇదేనని పలువురు చెబుతున్నారు. ఈ అనకొండను అతను ఎలా పట్టుకున్నాడో తెలియదు. కానీ అక్కడ ఉన్న వ్యక్తులను మాత్రం ఆ అనకొండ హాని చేయడం లేదు. దీనికి సంబంధించిన వీడియో ఎప్పటిదో తెలియదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ పడవలో బంధించిన భారీ అనకొండను @Aloys-Mythical-q6f అనే యూట్యూబర్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. అమెజాన్ అడువుల్లో ఫిషింగ్ బోటులో భారీ అనకొండ అని టైటిల్ పెట్టి పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏందీ భయ్యా.. భారీ అనుకొండను అలా ఎలా పట్టేశావ్? అని కామెంట్స్ చేస్తున్నారు. అది ఏమైనా చేపనా అలా పట్టుకొని పడవలో పెట్టావ్.. అని మరికొంతమంది చెబుతున్నారు.