Published On:

Giant Anaconda in Amazon: అమెజాన్ అడ‌వుల్లో భారీ అన‌కొండ‌.. ఒళ్లు గగుర్పొడిచేలా వీడియో

Giant Anaconda in Amazon: అమెజాన్ అడ‌వుల్లో భారీ అన‌కొండ‌.. ఒళ్లు గగుర్పొడిచేలా వీడియో

Giant Anaconda in amazon forest: ప్రపంచంలోనే అతిపెద్ద విషంలేని సర్పంగా అనకొండకు పేరుంది. ఈ సర్పాలు ఎక్కువగా దక్షిణ అమెరికాలో ఉంటాయి. అయితే భారత దేశంలో కొండచిలువలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని చూస్తేనే శరీరంలో వణుకు వస్తుంది. అలాంటిది ఏకంగా భారీ అనకొండ కనిపిస్తే ఇంకేమైన ఉందా.. ఊహించుకుంటేనే నరాలు జిల్లు మంటున్నాయి. అలాంటి ఏకంగా 30 అడుగుల కంటే ఎక్కువగా పొడువు ఉన్న ఓ భారీ అనకొండ నీళ్లల్లో అమాంతం వెళ్తే.. చచ్చేంత వరకు నిద్ర పట్టదు కదా.

 

తాజాగా, ఓ భారీ అనకొండ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. అమెజాన్ అడవుల్లో మధ్యలో ఉన్న ఓ నదిలో ఆ భారీ అనకొండ అమాంతం వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను @Sheetal2242 ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే ఈ భారీ అనకొండ అతిపెద్దదిగా గుర్తించారు. ఈ భారీ అనకొండను ఈక్వెడార్ ప్రాంతంలో కనిపించిందని చెబుతున్నారు.

 

అయితే, వీడియోలో ఈ అనకొండ చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఆ భారీ అనకొండ ఏకంగా నదిపై స్విమ్మింగ్ చేస్తున్నట్లు ఉంది. ఒక్కసారిగా నదిని ఆక్రమించినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను చూస్తే నిజమైనా అనకొండ అనేలా కనిపిస్తుంది. కానీ దగ్గరగా పరిశీలిస్తే.. నిజమే అనేలా ఉంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ నోరు తెరవాల్సిందే. ఏకంగా ఈ వీడియోను నేటివరకు 8 లక్షలకుపైగా చూశారంటే ఆ వీడియోలో అంత మ్యాటర్ ఉందని చెప్పుకోవచ్చు.

 

అయితే చాలా మంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫేక్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా గ్రాఫిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకంటే ఇంకా భారీ అనకొండ ఉందని మరొకరు చెబుతున్నారు. అయితే ఇది హాలీవుడ్ సినిమా క్లిప్ అని కొంతమంది అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ వీడియోను వేలల్లో లైక్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోను ఓ లుక్ వేయండి.