Massive King Cobra: ఏంటి ఇది? కింగ్ కోబ్రా నీళ్లు తాగడం చూశారా..? చూస్తూనే భయంతో పోయేలా ఉన్నాం! ఆ యువకుడి చేసిన పని చూస్తే!

Massive KING COBRA Drinking Water: వరల్డ్ వైడ్గా కింగ్ కోబ్రాలు చాలా విషపూరితమైనవి. ఇందులో న్యూరో టాక్సిక్ అనే మోస్ట్ పవర్ ఫుల్ విషం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కింగ్ కోబ్రాలు సుమారు 30 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ జాతికి చెందిన కింగ్ కోబ్రాలు మనిషిపై దాడి చేస్తే.. ఏకంగా నాడీ వ్యవస్థపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాటు వేసిన తర్వాత మరణించే అవకాశాలు ఉంటాయి.
అయితే, ఇంత భయంకరమైన కింగ్ కోబ్రాలు కనిపిస్తే చాలు కిలోమీటర్ దూరం పారిపోతారు. కానీ, కొంతమంది ఏకంగా ఇళ్లల్లోనే పెంచుకుంటున్నారు. మరోవైపు కొంతమంది ఎలాంటి భయం లేకుండా కింగ్ కోబ్రాలను సైతం పట్టుకోవడానికి వెనుకడుగు వేయడం లేదు. తాజాగా, ఓ యువకుడు అలాంటి కింగ్ కోబ్రాలకు ఏకంగా నీళ్లను తాపాడు. వాటికి దాహం ఉందని తెలుసుకొని మరి నీళ్లను తాపడమంటే సాహసమే అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే @V9Times అనే యూట్యూబ్ ఛానల్ వాళ్లు ఓ వీడియోను షేర్ చేశారు. బుసలు కొట్టే కింగ్ కోబ్రా దాహం తీర్చిన స్నేహితుడు.. అని టైటిల్ పెట్టి ఓ వీడియో ను విడుదల చేశాాడు. ప్రస్తుతం ఈ వీడియోను కేవలం 18 గంటల్లోనే ఏకంగా 6,500 మందికిపైగా చూశారు.
ఈ వీడియోలో ఓ యువకుడు కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఎండ తీవ్రతకు దాహంగా ఉందని తెలుసుకొని ఓ చిన్న పైపు ద్వారా నీళ్లను తాపేందుకు ప్రయత్నిస్తాడు. ఆ కింగ్ కోబ్రా నీళ్లను తాగుతుంది. దీంతో స్థానికులు షాక్ అవుతారు. ఇలా కింగ్ కోబ్రాలు నీళ్లను తాగుతాయా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇక, ఆ సర్పం పైపును నోటితో పట్టుకొని నీళ్లను తాగింది. ఆ తర్వాత ఆ కింగ్ కోబ్రానును పట్టుకొని అడవిలో వదిలేసినట్లు చెబుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.