Published On:

Largest King Cobra: వామ్మో.. ఇంత పెద్ద కింగ్ కోబ్రానా.. పట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌!

Largest King Cobra: వామ్మో.. ఇంత పెద్ద కింగ్ కోబ్రానా.. పట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌!

The world’s Largest king Cobra: ప్రపంచంలో చాలా పొడవు, విషపూరితమైన పాములు ఉన్నాయి. కాగా, ఇందులో మొదటి స్థానంలో కింగ్‌ కోబ్రా జాతి ఉంటుంది. ఇవి ఎక్కువ ఇండియాతోపాటు ఆగ్నేయాసియా దేశాల్లో చిత్తడి నేలల్లో జీవిస్తాయి. చాలా చురుకుగా ఉంటాయి. అత్యంత తెలివి గల పాములుగా పేరు పొందాయి. పాములు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. సాధారణంగా కింగ్‌ కోబ్రాలు 4 నుంచి 5 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. ఆరు అడుగుల వరకు పెరుగుతూ ఉంటాయి. వీటి బరువు ఆరు నుంచి 8 కిలోల బరువు ఉంటుంది.

 

కింగ్‌ కోబ్రాల బరువు వయసును బట్టి ఉంటుంది. కొన్ని పెద్ద కింగ్‌ కోబ్రాలు 9 కిలోల బరువు కలిగి ఉంటాయి. పాములు బెదిరించే క్రమంలో పడగ విప్పుతాయి. ముందుగా పడగ చూపిస్తూ చేస్తాయి. పాములకు వెనక భాగంలో రెండు మచ్చలు ఉంటాయి. మచ్చలు ప్రత్యేకమైన ఆకారాల్లో ఉంటాయి. కింగ్‌ కోబ్రాలు పాములను చంపుకుని ఆహారంగా తింటాయి. వీటి శాస్త్రీయ నామం ‘ఓఫియోఫాగస్’. పాములకు సంబంధించిన వీడియోలు చాలా చూసి ఉంటాం. కానీ, తాజాగా వైరల్‌ అవుతున్న అరుదైన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

తాజాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్న కింగ్‌ కోబ్రా ప్రపంచంలోనే చాలా పొడవైనది. పామును పట్టుకునేందుకు ఓ స్నేక్‌ క్యాచర్‌ ప్రతయత్నిస్తాడు. పట్టుకునే క్రమంలో కింగ్ కోబ్రా దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. పాము పెద్దది కావడంతో పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. స్నేక్‌ క్యాచర్‌ భయపడకుండా దానిని పట్టుకున్నాడు. సుమారు 3 నుంచి 4 నిమిషాల పాటు సాహసం చేసి పట్టుకున్నాడు. పాముకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

 

 

ఇవి కూడా చదవండి: