Last Updated:

Pawan Kalyan: ధర్మపురి నారసింహుడి క్షేత్రంలో జనసేనాని.. అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Pawan Kalyan: ధర్మపురి నారసింహుడి క్షేత్రంలో జనసేనాని.. అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా పండితులు పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

 

అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం

పవన్ కళ్యాణ్ సంకల్పించిన అనుష్టుప్ నారసింహ యాత్రకు ధర్మపురి నుంచి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మొత్తం 31 నారసింహ క్షేత్రాలను ఆయన సందర్శిస్తారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2009 లో పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రాంతానికి వచ్చినప్పుడు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం బారినపడ్డారు.

ఆ ఆంజనేయ స్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్టు పవన్ కళ్యాణ్ విశ్వసిస్తారు.

అందుకే ఆయన తలపెట్టే అతి ముఖ్య కార్యక్రమాలను కొండగట్టు నుంచి ప్రారంభించడానికి భావిస్తారు.

ఈ క్రమంలోనే ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనుష్టుప్ నారసింహ యాత్రను ప్రారంభించారు.

ఆ తర్వాత క్రమేణా మిగిలిన 31 క్షేత్రాలను పవన్ కళ్యాణ్ Pawan Kalyan సందర్శిస్తారు.

అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం జనసేన  పార్టీ ప్రచార రథం ‘వారాహి’కి వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి ని ప్రారంభించారు.

కొండగట్టులో పవన్ పర్యటన సందర్భంగా ఆయన చూసేందుకు అభిమానులు , జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అభిమానులు పవన్ కళ్యాణ్ ను గజమాలతో సత్కరించారు.

ఆ సందర్భంగా ఓపెన్ టాప్ వాహనం నుంచి అభిమానులకు అభివాదం చేశారు. పవన్ పర్యటన సందర్భంగా కొండగట్టు, ధర్మపురి పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తర్వాత నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం అయ్యారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

తెలంగాణలో పార్టీ స్థితిగతుల గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ భవిష్యత్ తరాల కోసం జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు.

తెలంగాణ కళాకారుల రగిలించిన చైతన్యమే తన పోరాటానికి స్ఫూర్తి అని పవన్ అన్నారు. తుది శ్వాస వరకు తెలుగు రాష్ట్రాల ఐక్యత కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

తెలంగాణ లో 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని వవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/