Last Updated:

Pawan Kalyan-Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో జనసేనాని ఎంట్రీ.. అంబరాన్ని అంటిన సంబరాలు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్‌ తొలిసారిగా చిరంజీవిని కలిసేందుకు వెళ్లారు. చిరంజీవి కాళ్లు మొక్కి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు

Pawan Kalyan-Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో జనసేనాని ఎంట్రీ.. అంబరాన్ని అంటిన సంబరాలు..

Pawan Kalyan-Chiranjeevi: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్‌ తొలిసారిగా చిరంజీవిని కలిసేందుకు వెళ్లారు. చిరంజీవి కాళ్లు మొక్కి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి హారతిచ్చి పవన్‌ను అశీర్వదించారు. తన ఇంటికొచ్చిన తమ్ముడు పవన్ కి స్వీట్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబసభ్యులు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అభిమానులు.పవన్‌ కళ్యాణ్ రాకతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది.

ఇవి కూడా చదవండి: