Published On:

Chiranjeevi: కూతురు విడాకులు.. మొదటిసారి స్పందించిన మెగాస్టార్

Chiranjeevi: కూతురు విడాకులు.. మొదటిసారి స్పందించిన మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. అందరికీ మెగాస్టార్ అయినా కూడా  ఇంట్లో మాత్రం ఆయన తల్లిచాటు బిడ్డ, కొంగుచాటు భర్త, పిల్లలకు మంచి తండ్రి.  చిరంజీవికి ముగ్గు పిల్లలు.. సుస్మిత, రామ్ చరణ్, శ్రీజ. ముగ్గురికి వివాహాలు అయ్యాయి.  కొడుకు- కోడలు, కూతురు- అల్లుడు, మనవరాళ్లతో మెగా ఫ్యామిలీ  ఎప్పుడు  కళకళలాడుతూ ఉంటుంది.

 

అయితే  చిరు మూడో కూతురు శ్రీజ గురించి అందరికీ తెల్సిందే.  గతంలో ఆమె చేసిన వివాదం అంతా ఇంతా కాదు. ఒక అబ్బాయిని ప్రేమించి, ఇంట్లో ఒప్పుకోలేదని పెళ్లి చేసుకొని.. మీడియా ముందుకు వచ్చి తన ఫ్యామిలీ వలన తనకు ప్రాణహనీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత కొద్దీ రోజులకే అతనితో విడిపోయి మళ్లీ తండ్రి చెంతకు చేరింది.

 

ఇక చిరంజీవి కూతురు చేసిన పనిని మనసులో పెట్టుకోకుండా కళ్యాణ్ దేవ్ అనే కుర్రాడితో శ్రీజకు రెండో వివాహం జరిపించారు. అప్పటికే శ్రీజకు ఒక పాప. కళ్యాణ్ దేవ్ తో ఒక పాప. ఇక ఈ జంట జీవితాంతం కలిసి ఉంటుంది అనుకొనే సమయంలో శ్రీజ మరోసారి బాంబ్ పేల్చింది. కళ్యాణ్ దేవ్ తో కూడా ఆమె విడాకులు తీసుకొని విడిపోయింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో తండ్రి వద్దనే నివసిస్తోంది.

 

శ్రీజ విడాకుల గురించి ఏరోజు చిరంజీవి నోరు విప్పింది లేదు.  అయితే మొట్టమొదటిసారి చిరు.. శ్రీజ విడాకుల గురించి స్పందించాడు. నేడు మహిళా దినోత్సవ సందర్భంగా కుటుంబంతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీజ విడాకుల సమయంలో ఆమెకు తన తల్లి అంజనాదేవి ఎంతో దైర్యం ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ” అమ్మ పాజిటివ్ నెస్ గురించి చెప్పాలి. నా రెండో కూతురు శ్రీజ డివోర్స్ తీసుకున్న సమయంలో అమ్మ ఎంతో ధైర్యం చెప్పింది. శ్రీజనే నాకు స్వయంగా చెప్పింది.

 

నాన్నమ్మ దగ్గరకు వెళ్లాను.. ఎనలేని దైర్యం వచ్చింది. నానమ్మ దగ్గర కూర్చుంటే ఎక్కడలేని పాజిటివ్ వైబ్ వస్తుంది అని చెప్పింది. ఎందుకమ్మా బాధపడతావ్.. లైఫ్ అంటే ఒకరితోనే ఆగిపోయేది కాదు. వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ తో మన మీద నియంత్రించడం కానీ, మన బాధలను వారితో షేర్ చేసుకోకు.నీ మనసుకు ఏది అనిపిస్తే అలానే వెళ్ళిపో అని చెప్పినట్లు” చిరు తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి: