Last Updated:

Sonu Sood Meets Kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు వచ్చిన నటుడు సోనూసూద్‌

మాదాపూర్‌లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను నటుడు సోనుసూద్ సందర్శించారు. కాసేపు ఆమెతో సరదాగా ముచ్చటించారు. అనంతరం కుమారి ఆంటీ ఫుడ్ మెనూ రేట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. తాను కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి.. తన బాగోగులు అడిగి తెలుసుకున్నందుకు కుమారి ఆంటీ ధన్యవాదాలు తెలిపారు.

Sonu Sood Meets Kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు  వచ్చిన నటుడు సోనూసూద్‌

Sonu Sood Meets Kumari Aunty: మాదాపూర్‌లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను నటుడు సోనుసూద్ సందర్శించారు. కాసేపు ఆమెతో సరదాగా ముచ్చటించారు. అనంతరం కుమారి ఆంటీ ఫుడ్ మెనూ రేట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. తాను కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి.. తన బాగోగులు అడిగి తెలుసుకున్నందుకు కుమారి ఆంటీ ధన్యవాదాలు తెలిపారు.

డిస్కౌంట్ ఇస్తారా? (Sonu Sood Meets Kumari Aunty)

ఈ సంద‌ర్భంగా ఆమెతో సరదాగా మాట్లాడిన సోనూసూద్ మీ ద‌గ్గర ఎలాంటి వంట‌కాలు దొరుకుతాయ‌ని అడిగారు. త‌న వ‌ద్ద అన్ని ర‌కాల వెజ్‌, నాన్‌వెజ్ ఫుడ్ దొరుకుంద‌ని కుమారి ఆంటీ చెప్పారు. అలాగే వెజ్ రూ. 80 అని, నాన్‌వెజ్ రూ. 120 అని ఆమె తెలిపారు. దీనికి సోనూసూద్ తాను మాత్రం వెజ్ మాత్రమే తింటాన‌ని అన్నారు. త‌న‌కు ఏదైనా డిస్కౌంట్ ఉంటుందా? అంటూ ఆయన కుమారి ఆంటీని అడిగినపుడు మీకైతే ఫ్రీగా వ‌డ్డిస్తాన‌ని అన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో మందికి సాయం చేసిన మీకు ఎంత పెట్టినా త‌క్కువే అని చెప్పారు. ఈ సందర్బంగా కుమారి ఆంటీకి సోనూసూద్‌ ఫుడ్ సైతం సర్వ్ చేశారు. ఆమెను శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు.సోనూసూద్ అక్కడకు వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.

సోనూ సూద్ కుమారి ఆంటీతో వారి సమావేశానికి సంబంధించిన వీడియోను X లోషేర్ చేసారు, దానికి మీకు మీరే మీ పరిమితి అని కాప్షన్ పెట్టారు. కుమారి ఆంటీ నిశ్శబ్ధ శక్తికి మరియు ప్రతి మహిళలో ఉండే అచంచలమైన దృఢత్వానికి ప్రతీక అని కొనియాడారు. పదాలు మరియు చర్యలు రెండింటి ద్వారా ఈ అపరిమితమైన శక్తి స్వరూపులకు మద్దతు ఇవ్వాలని, జరుపుకోవాలని, ఉద్ధరించాలని, మరియు శక్తివంతం చేయాలని సూద్ ప్రతి ఒక్కరినీ కోరారు.

 

ఇవి కూడా చదవండి: