Vivo T4 5G Features Leaked: పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త వివో 5జీ ఫోన్.. 7,300mAh బ్యాటరీ.. లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్!

Vivo T4 5G Features Leaked: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో కొంతకాలంగా బడ్జెట్, మిడ్-రేంజ్ నుండి ప్రీమియం విభాగాలలో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తోంది. ఇప్పుడు కంపెనీ మరో కొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి, కంపెనీ త్వరలో భారతదేశంలో Vivo T4 5Gని విడుదల చేయనుంది. దీని ధర గత నెలలో దేశంలో రూ. 13,999కి విడుదల చేసిన T4x కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రాబోయే T4 లాంచ్‌కు ముందు ఫోన్ ఫీచర్లు వెల్లడయ్యాయి. ఇది అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది.
ఈ కొత్త ఫోన్ సపోర్ట్ పేజీ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ దాని ధర విభాగంలో అతిపెద్ద బ్యాటరీని అందిస్తుందని తెలుస్తుంది. ఈ టీజర్ లో ఈ డివైస్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ కలిగి ఉండవచ్చని, ఫోన్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో కూడా ఉండవచ్చని సూచిస్తుంది.
Vivo T4 5G Features
Vivo T4 5G దాని ధర విభాగంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. లీకైన సమాచారం ప్రకారం ఫోన్ 5,000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్నెస్‌ను అందించగలదు. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది 820K+ AnTuTu స్కోర్‌ను అందిస్తుంది. టెక్ ఇండస్ట్రీ అప్‌డేట్ ప్రకారం.. T4 రెండు రంగులలో ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రేలలో వస్తుంది.
లీకైన ఫోటోల్లో T4 లో డ్యూయల్ కెమెరా సెన్సార్లతో కూడిన సర్కిల్ కెమెరా మాడ్యూల్, లోపల రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉండవచ్చని వెల్లడిస్తున్నాయి. అలాగే, మరో లీకైన నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద 7,300mAh బ్యాటరీ ఉంటుంది.
Vivo T4 5G Price
ఈ నెలాఖరు నాటికి Vivo T4 5G లాంచ్ అవుతుందని చెబుతున్నారు. గత సంవత్సరం లాంచ్ అయిన Vivo T3 ధర లాంచ్ సమయంలో రూ.19,999గా ఉంది. అందువల్ల, T4 కూడా భారతదేశంలో అదే ధర విభాగంలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- OnePlus Red Rush Days Sale: వావ్.. వండర్ఫుల్.. వన్‌ప్లస్ కొత్త సేల్.. స్మార్ట్ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్స్..!