Published On:

OnePlus Red Rush Days Sale: వావ్.. వండర్‌ఫుల్.. వన్‌ప్లస్ కొత్త సేల్.. స్మార్ట్‌ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్స్..!

OnePlus Red Rush Days Sale: వావ్.. వండర్‌ఫుల్.. వన్‌ప్లస్ కొత్త సేల్.. స్మార్ట్‌ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్స్..!

Rs 19,000 discount on OnePlus Red Rush Days Sale: వన్‌ప్లస్ తన కొత్త సేల్ ప్రకటించింది. వన్‌ప్లస్ ఈ సేల్‌కు రెడ్ రష్ డేస్ సేల్ అని పేరు పెట్టింది. ఈ సేల్ ఏప్రిల్ 8న ప్రారంభమై, ఏప్రిల్ 13 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ తన రెడ్ రష్ డేస్ సేల్‌లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 12,వన్‌ప్లస్ నార్డ్ 4, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వన్‌ప్లస్ ప్రత్యేకమైన సేల్‌లో మీరు ఫోన్‌లపై రూ.19,000 వరకు తగ్గింపు పొందుతారు. ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

 

OnePlus 13
వన్‌ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్‌లో OnePlus 13 పై రూ. 5,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తుంది. OnePlus 13R పై రూ. 3,000 తగ్గింపును పొందగలరు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ఆఫర్లు వర్తిస్తాయి. OnePlus 13 కొనుగోలుదారులు రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందచ్చు. OnePlus 13R కొనుగోలుదారులు రూ. 4,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందచ్చు.

 

OnePlus Nord 4
ఈ సేల్‌లో OnePlus Nord 4 ఫోన్‌పై రూ.500 ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. దీనితో పాటు, మీరు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.4,500 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లన్నింటినీ OnePlus.in, ఆఫ్‌లైన్ భాగస్వామి స్టోర్‌ల నుండి కొనుగోలు చేయచ్చు.

 

OnePlus 12
వన్‌ప్లస్ 12 కొనుగోలు చేసే కస్టమర్‌లు ఈ సేల్‌లో అతిపెద్ద తగ్గింపును పొందబోతున్నారు. ఈ ఫోన్ రూ. 13,000 వరకు ప్రత్యక్ష తగ్గింపుతో సేల్‌లో విక్రయిస్తుంది. దీనితో పాటు, ఫోన్‌పై రూ.6,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీని కారణంగా మొత్తం తగ్గింపు రూ. 19 వేలు అవుతుంది. వన్‌ప్లస్ 12 ప్రస్తుతం OnePlus.inలో రూ.51,999కి అమ్ముడవుతోంది. దీని కంటే చాలా తక్కువ ధరకు సేల్‌లో లభిస్తుంది.

 

OnePlus Nord CE4, CE4 Lite
వన్‌ప్లస్ OnePlus Nord CE4 కొనుగోలుపై కస్టమర్లు రూ. 1000 ధర తగ్గింపును పొందుతారు. OnePlus Nord CE4 కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.2000 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. 1,500 బ్యాంక్ డిస్కౌంట్‌తో Nord CE4 Lite కొనుగోలు చేయవచ్చు.