Last Updated:

IPL 2025: నేడు రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్

IPL 2025: నేడు రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్

Kolkata Knight Riders vs Rajasthan Royals Match 6 IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. గువహటి వేదికగా బర్సాపారా స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 14 విజయాలు సాధించాయి. అయితే ఈ సీజన్‌లో ఇరు జట్లు ఓటమితో టోర్నీని ప్రారంభించాయి.

 

సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి చెందగా.. ఆర్సీబీ చేతిలో నైట్ రైడర్స్ ఘోరంగా ఓడిపోయంది. దీంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని చూస్తున్నాయి. ఇక, ఈ మ్యాచ్‌లోనూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది.