Published On:

Cricket: ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా రెడీ.. విమెన్స్ టీమ్ ఇదే

Cricket: ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియా రెడీ..  విమెన్స్ టీమ్ ఇదే

Team India: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య ట్రైసిరీస్ గెలుపుతో ఊపుమీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. అందుకు సంబంధించి త్వరలోనే ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జట్టులో షఫాలీ వర్మకు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత షఫాలీ మళ్లీ జట్టులోకి చేరనుంది.

 

కాగా ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల జట్టు 5 టీ20, 3 వన్డేలు ఆడనుంది. సుదీర్ఘమైన సిరీస్ కోసం సెలక్టర్లు గట్టి జట్టును ఎంపిక చేశారు. జూన్ 28న ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. జూలై 22న ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది.

 

వన్డే జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్, యుస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, సుచీ ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గాడ్, సయాలీ సత్గరే.

 

టీ20 జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, సుచీ ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గాడ్, సయాలీ సత్గరే.

Capture