OnePlus Nord 5-Nord CE 5: అతిపెద్ద న్యూస్.. వన్‌ప్లస్ నుంచి రెండు కొత్త ఫోన్లు.. పెద్ద బ్యాటరీ.. అదిరే ఫీచర్లు..!

OnePlus Nord 5-Nord CE 5: వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్‌కు సంబంధించి చాలా కాలంగా లీక్‌లు, సమాచారం బయటకు వస్తున్నాయి. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ధృవీకరణ చేయలేదు. కానీ నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం OnePlus Nord CE 5 లైట్‌ను దాటవేసి నేరుగా నార్డ్ CE 5, నార్డ్ 5 మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటి వరకు, ఈ రెండు ఫోన్లు అనేక సర్టిఫికేషన్ సైట్లలో కనిపించాయి. XpertPick నివేదిక ప్రకారం, ఇప్పుడు OnePlus Nord 5 సింగపూర్ IMDA అథారిటీ నుండి ఆమోదం పొందింది. అదే సమయంలో, IMDA సర్టిఫికేషన్‌కు ముందు, Nord 5 మలేషియా SIRIM సర్టిఫికేషన్ వెబ్సైట్లో కూడా కనిపించింది. అలాగే, కొంతకాలం క్రితం UAE లోని TDRA, GCF సర్టిఫికేషన్ సైట్లలో Nord CE 5 కనిపించింది.
OnePlus Nord 5, Nord CE 5 Features
OnePlus Nord 5 (మోడల్ నంబర్ CPH2709) IMDA (ఇన్ఫోకామ్ మయన్మార్ డిజిటల్ అథారిటీ) డేటాబేస్‌లో గుర్తించారు. గతంలో ఈ ఫోన్ SIRIM, TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్లలో కూడా కనిపించింది. ఈ ఫోన్ 6,550mAh బ్యాటరీ (రేటెడ్ విలువ) తో రావచ్చని, 80W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వవచ్చని TUV లిస్టింగ్ వెల్లడించింది. అదే సమయంలో, OnePlus Nord CE 5 (మోడల్ నంబర్ CPH2719) కూడా SIRIM (మలేషియా), IMDA (సింగపూర్) సర్టిఫికేషన్ పొందింది. అయితే, ఈ మోడల్ ఇటీవలి సర్టిఫికేషన్స్ దాని కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు.
OnePlus Nord 5, Nord CE 5 Specifications
OnePlus Nord 5 గురించి ప్రస్తుతం వస్తున్న లీక్స్ ప్రకారం.. 6.77-అంగుళాల LTPS OLED 1.5K 120Hz స్క్రీన్, డైమెన్సిటీ 9400e చిప్సెట్, 80W ఛార్జింగ్‌తో కూడిన 7,000mAh బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో, Nord CE 5 FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల OLED డిస్ప్లేతో రావచ్చు. ఇది డైమెన్సిటీ 8350 చిప్సెట్, 80W ఛార్జింగ్‌తో 7,100mAh బ్యాటరీని అందిస్తుంది. రెండు స్మార్ట్ఫోన్లలో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50-మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఉంటాయి.
OnePlus 13s
వన్‌ప్లస్ ప్రస్తుతం వన్‌ప్లస్ 13s లాంచ్ తేదీని ప్రమోట్ చేస్తోంది, ఇది ఈ నెలాఖరులో లేదా జూన్ ప్రారంభంలో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. దీని అర్థం నార్డ్ 5 సిరీస్ జూన్ చివరి నాటికి లేదా జూలై నాటికి విడుదల చేయచ్చు.