Published On:

Turkey Earthquake 2025: టర్కీలో భారీ భూకంపం.. భయంతో ప్రజల పరుగులు

Turkey Earthquake 2025: టర్కీలో భారీ భూకంపం.. భయంతో ప్రజల పరుగులు

Turkey Earthquake Today:  టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1గా తీవ్రత నమోదైంది. కోన్యాలో ఇవాళ భూమికంపించినట్టు అధికారులు తెలిపారు. కాగా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలువురు గాయపడినట్టు సమాచారం. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పర్యటిస్తున్న దేశ రాజధాని అంకారాలో కూడా భూకంపం సంభవించింది.

 

ఫిబ్రవరి 2023లో టర్కీ మరియు సిరియాలో అతి ప్రమాదకరమైన భూకంపాలు సంభవించాయి. మొదట భూకంపం 7.8 తీవ్రత నమోదుకాగా.. రెండవ భూకంపం 7.5 తీవ్రత నమోదయ్యంది. అదే సమయంలో భయంకరమైన, భీకర భూ ప్రకంపనలు సంభవించటంతో చాలా భవనాలు నెలమట్టమయ్యాయి. ఫలితంగా.. సిరియాలో 8,000 మంది మరణించగా.. టర్కీలో 59,001 పైగా మరణించారు.