Published On:

Kia Syros Price Hiked: కియా లవర్స్‌కు భారీ షాక్.. సైరోస్‌ ఎస్‌యూవీ ధర పెంపు.. ఎంత పెరిగిందంటే?

Kia Syros Price Hiked: కియా లవర్స్‌కు భారీ షాక్.. సైరోస్‌ ఎస్‌యూవీ ధర పెంపు.. ఎంత పెరిగిందంటే?

Kia Syros Price Hiked: దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా మోటార్స్ భారత మార్కెట్లో వివిధ విభాగాలలో వాహనాలను విక్రయిస్తోంది. తయారీదారు సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీ విభాగంలో అందించే కియా సైరోస్ ధరలను పెంచారు. కియా ధరలు ఎంత పెంచింది? ఏ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పులు చేశారు? తదితర వివరాలు తెలుసుకుందాం.

 

కియా మోటార్స్ సబ్ ఫోర్ మీటర్ ఎస్‌యూవీ విభాగంలో అందిస్తున్న కియా సైరోస్‌ను కొనడం ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. కంపెనీ దాని ధరలను రూ. 50 వేల వరకు పెంచింది. అలానే ఈ ఎస్‌యూవీ బేస్ వేరియంట్‌ ధర కూడా భారీగా పెరిగింది. సైరోస్ బేస్ వేరియంట్‌గా HTKని అందిస్తుంది. ఈ వేరియంట్ ధర రూ. 8.99 లక్షల. కానీ ఇప్పుడు పెరుగుదల తర్వాత, దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.49 లక్షలుగా మారింది.సైరోస్ రెండవ బేస్ వేరియంట్‌గా HTK (O) అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు.

 

ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 10.29 లక్షలుగా మారింది. దీని ధరను రూ.30 వేలు పెంచారు. HTK ప్లస్‌ను ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడా అందిస్తున్నారు. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను కూడా రూ.30 వేలు పెంచారు. పెంపునకు ముందు, దీనిని రూ.11.49 లక్షలకు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు దాని ఎక్స్-షోరూమ్ ధర రూ.11.79 లక్షలుగా మారింది. ఒక-లీటర్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కాకుండా, దాని HTK ప్లస్ టర్బో DCT కూడా ఖరీదైనదిగా చేసింది. దీని ధర కూడా రూ. 30 వేలు పెరిగింది, ఆ తర్వాత ఇప్పుడు రూ. 13.09 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

 

కియా సిరోస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికతో పాటు డీజిల్ మాన్యువల్ ఇంజిన్‌తో అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో ఎస్‌యూవీ HTK (O) వేరియంట్ క్క ఎక్స్-షోరూమ్ ధరను రూ.30 వేలు పెంచారు. ఆ తర్వాత ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షలకు బదులుగా రూ. 11.29 లక్షలుగా మారింది. HTK ప్లస్ డీజిల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను కూడా రూ.30,000 పెంచారు. ఆ తరువాత దీనిని రూ. 12.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందిస్తున్నారు. కంపెనీ ఒక లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ HTX, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో HTX ప్లస్, HTX ప్లస్ (O), HTX డీజిల్ మాన్యువల్,డీజిల్ ఆటోమేటిక్ రెండు వేరియంట్‌ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు.