Published On:

Sourav Ganguly : పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లే వ‌ద్దు : భార‌త మాజీ క్రికెట‌ర్‌ సౌర‌వ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

Sourav Ganguly : పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లే వ‌ద్దు : భార‌త మాజీ క్రికెట‌ర్‌ సౌర‌వ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు

former Indian cricketer Sourav Ganguly comments : జమ్ముకాశ్మీర్‌లోని పెహ‌ల్గాం ఉగ్ర‌దాడి ఘ‌ట‌నపై భార‌త మాజీ క్రికెట‌ర్‌, బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాక్‌తో అన్ని క్రికెట్ సంబంధాల‌ను తెంచుకోవాల‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కోల్‌క‌తాలో గంగూలీ ఓ వార్తా సంస్థ‌తో మాట్లాడారు. పాక్‌తో క్రికెట్ సంబంధాలంటినీ 100 శాతం నిలిపివేయాల‌ని కోరారు. చాలా క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని చెప్పారు. ఇలాంటి ఘ‌ట‌న‌లను జోక్‌గా తీసుకోవ‌ద్దని తెలిపారు. ఉగ్ర‌వాదాన్ని స‌హించ‌బోమని స్పష్టం చేశారు. వాస్త‌వానికి చాలా ఏళ్లనుంచి పాకిస్థాన్, భారత్ మ‌ధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జ‌ర‌గ‌డం లేదు. ఇటీవ‌ల కేవ‌లం ఐసీసీ నిర్వ‌హించే ఈవెంట్ల‌లో మాత్రమే రెండు దేశాలు పోటీప‌డుతున్నాయి.

 

పాక్‌తో భారత్ మ్యాచ్‌లు..
ఇరుదేశాల మ‌ధ్య చాలా రోజుల నుంచి రాజ‌కీయ ప‌రిస్థితుల నెలకొన్నాయి. దీంతో 2008 నుంచి పాకిస్థాన్‌లో భారత్ ప‌ర్య‌టించ‌లేదు. చివ‌రిసారి ఆసియా క‌ప్‌లో రెండు జట్లు త‌ల‌ప‌డ్డాయి. 2012-13లో చివ‌రిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొన్నాయి. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఐసీసీ టోర్నీలో పాల్గొన్నా పాక్‌లో ఆడేందుకు మాత్రం భారత్ నిరాక‌రించింది. దుబాయ్‌లో పాక్‌తో మ్యాచ్‌లు ఆడింది. భారత్, పాక్ మ‌ధ్య హైబ్రిడ్ మోడ‌ల్ క్రికెట్ జ‌ర‌గాల‌ని ఇటీవ‌ల ఐసీసీ నిర్ణ‌యించింది. త‌ట‌స్థ వేదిక‌ల‌పై ఆడేందుకు నిర్ణ‌యించారు కానీ, ఇప్పుడు ఆ వేదిక‌ల్లో ఆడ‌రాదు అన్న అభిప్రాయాలు వ్య‌క్తమవుతున్నాయి.

 

 

ఇవి కూడా చదవండి: