Last Updated:

India vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. విజేతగా భారత్

India vs New Zealand: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. విజేతగా భారత్

India vs New Zealand ICC Champions Trophy 2025 Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్ వెల్(53), రచిన్ రవీంద్ర(37), గ్లెన్ ఫిలిప్స్(34), విల్ యంగ్(15), కేన్ విలియమ్సన్(11), టామ్ లేథమ్(14), మిచెల్ శాంట్నర్(8) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, షమీ చెరో వికెట్ తీశారు.

252 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ అదరగొట్టింది. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(76), శుభ్ మన్ గిల్(31), విరాట్ కోహ్లీ(1), శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(34), అక్షర్ పటేల్(29), హార్దిక్ పాండ్యా(18), రవీంద్ర జడేజా(9) పరుగులు చేశాడు.