Published On:

India Vs Bangladesh: ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లు.. బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు!

India Vs Bangladesh: ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లు.. బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు!

India Vs Bangladesh white-ball Tour Schedule: ఐపీఎల్ మెగా టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా షెడ్యూల్ మరింత బిజీబిజీగా మారనుంది. ఇతర దేశాలతో వరుసగా సిరీస్‌లు, టూర్లు ఉండనున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటించనుంది. తాజాగా, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు కాసేపటి క్రితం బీసీసీఐ అనౌన్స్‌మెంట్ చేసింది.

 

బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు రెండు వేదికల్లో జరగనుండగా.. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు వన్డే సిరీస్ ముగియనుంది.

 

వన్డే సిరీస్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. తొలి వన్డే మ్యాచ్ ఆగస్టు 27వ తేదీన మిర్చూర్ వేదికగా ప్రారంభం కానుంది. అలాగే రెండో వన్డే ఆగస్టు 20వ తేదీన మిర్చూర్ వేదికగానే జరగనుంది. మూడో వన్డే ఆగస్టు 23వ తేదీన చట్టోగ్రామ్ స్టేడియంలో జరగనుంది. దీంతో పాటు టీ20 సిరీస్ షెడ్యూల్‌ విషయానికొస్తే.. తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 26వ తేదీన చట్టోగ్రామ్ స్టేడియంలో జరగనుంది. రెండో టీ20 ఆగస్టు 29వ తేదీన మిర్చూర్, మూడో వన్డే ఆగస్టు 31వ తేదీన మిర్చూర్ మైదానంలో జరగనుంది.