Dhanashree verma: భారత స్పిన్నర్ చాహల్‌తో మిస్టరీ గర్ల్.. ధనశ్రీ సంచలన పోస్ట్

Dhanashree Reacts After Yuzvendra Chahal Shows Off His New Partner: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ సందడిగా సాగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ అద్బుత ప్రదర్శన కనబర్చి ట్రోఫీ కైవసం చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్‌తో పాటు సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖలు తరలివచ్చారు. ఇందులో భాగంగానే భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యారు.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో చాహల్ నవ్వుతూ కెమెరాలో పదేపదే కనిపించాడు. అయితే తనతో పాటు ఓ అమ్మాయి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో చూసిన వారిలో ఎవరీ మిస్టరీ గర్ల్ అంటూ ఆలోచన మొదలైంది. కాగా, ఆమె ఆర్జే మహ్వేష్ అని ఫైనల్‌గా కన్ఫార్మ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరూ మాట్లాడిన తీరుపై చర్చ కొనసాగింది.
ఈ విషయంపై యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. ‘మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, క్రికెటర్ చాహల్, మోడల్ ధనశ్రీలు ఇద్దరూ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడంతో పాటు డ్యాన్స్‌కు సంబంధించిన పోస్టులు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించేవారు. కానీ తర్వాత పెట్టిన పోస్టులు గందరగోళానికి గురిచేశాయి. ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు ధనశ్రీ పేరులో నుంచి చాహల్ పేరును తొలగించింది. దీంతో విడాకులు తీసుకుంటున్నారని ఊహాగానాలు వచ్చాయి.
Dhanshree Verma's Instagram story. pic.twitter.com/aM3IYJ4wBY
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2025