Last Updated:

Khammam Politics: ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్

Khammam Politics: ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్

Khammam Politics: తెలంగాణలో ఎన్నికల దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాలు బాగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ముందు నుంచీ ఈ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోవైపు ఇక్కడి నేతలకు గాలం వేసేందుకు బీజేపీ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తీవ్ర అసంత్రుప్తి లో ఉన్న అధికార పార్టీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ఇందుకు ముహార్తం ప్లాన్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అలర్ట్ అయ్యారు.

పార్టీ మారేందుకు రంగం సిద్దం

పార్టీలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) ను వీడి బీజేపీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. పార్టీలో ఆయన తీవ్ర అసంత్రుప్తిగా ఉన్నారనేది తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అయితే పార్టీ మారుతున్నట్టు మాత్రం స్వయంగా ప్రకటించలేదు. కానీ, తెర వెనుక మాత్రం బీజేపీ(BJP) అధిష్టానం .. పొంగులేటితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 18న ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పొంగులేటి సమావేశమయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు జిల్లాలో టాక్ నడుస్తోంది. అనంతరం అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. జనవరి 19న రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పొంగులేటి కలిసే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా కమలం గూటికి చేరిన వెంటనే… ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సైతం… పొంగులేటి ఇప్పటికే ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. ఆయన వెంట భారీ సంఖ్యలో నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరతారని ఖమ్మంలో చర్చ నడుస్తోంది.

పొంగులేటి సమావేశాలపై దృష్టి

ఇదిలా ఉండగా పొంగులేటి మంగళవారం నుంచి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడుతున్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గం నుంచి ఈ సమ్మేళనాలను ప్రారంభిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సంక్రాంతి తర్వాత నిర్వహించేందుకు ప్రణాళిక ఖరారు చేశారు. ఫిబ్రవరిలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పొంగులేటి(Ponguleti Srinivas Reddy) నిర్వహించే కార్యక్రమాలపైన అందరి దృష్టి నెలకొంది. సమావేశాల్లో పొంగులేటి ఏం మాట్లాడతారన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది.

ఖమ్మం సభ విజయవంతం కావాలి

టీఆర్‌ఎస్‌ను జాతీయ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఖమ్మంలో తొలి సభ నిర్వహిస్తోంది.

జాతీయవాదంతో అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీ (BJP)పై ఫైట్ కు దిగారు కేసీఆర్.

తెలంగాణవాదానికి పెద్దగా చోటులేని ఖమ్మంను కేంద్రంగా చేసుకొని బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యంగా కోస్తా, రాయలసీమకు చెందిన సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో సభ నిర్వహిస్తే ప్రాంతీయవాదానికి చోటు లేకుండా ఉంటుందన్న ఆలోచనతో కేసీఆర్(KCR) ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే తాను ఏపీలోనూ పార్టీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా ముందస్తు ప్రణాళికలో భాగంగానే తెలుస్తోంది. ఈ నెల 18న ఖమ్మం(Khammam)లో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం అదే ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు జాతీయ స్ధాయి నేతలని కేసీఆర్ ఆహ్వానించునున్నట్టు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఖమ్మం సభను విజయవంతం చేయాలని, అందుకు తగ్గట్టుగా ఏర్పాటు ఉండాలని నేతలకు సీఎం సూచించారు.

పోయే వాళ్ల గురించి ఆలోచనొద్దు

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ఖమ్మం(Khammam) సభ పకడ్బందీగా జరిగేందుకు కో ఆర్డినేటర్‌గా మంత్రి హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. జన సమీకరణ, స్థానికంగా ఏర్పాట్ల బాధ్యతను బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మరికొందరు ముఖ్య నేతలకు అప్పజెప్పినట్లు సమాచారం. మరోవైపు జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటడంతో పాటు బీఆర్‌ఎస్‌ విధానాలను దేశ ప్రజలు, రాజకీయ పక్షాలకు ఖమ్మం సభ ద్వారా వివరించాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంపై కూడా కేసీఆర్ (KCR) చర్చించినట్టు తెలుస్తోంది. ‘‘పొంగులేటి(Ponguleti Srinivas Reddy) పార్టీ నుంచి వెళ్లిపోతాడు.. ఆ విషయాన్ని వదిలేయండి.. పోతే పోనివ్వండి.. పోయే వాళ్ల గురించి ఆలొచించొద్దు.. ఖమ్మంలో అత్యధిక సీట్లు గెలుస్తాం. ఆ దిశగా కార్యాచరణ చేద్దాం’ అని బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ అన్నారు. పొంగులేటి పార్టీ మారినా మన కేడర్ జారీ పోకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మేల్యేలకు సీఎం సూచించారు.

ఇవి కూడా చదవండి:

 బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”

ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

 తక్కువ ధరలో మహీంద్రా థార్ సరికొత్త వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: