Vasantha Krishna prasad: ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు.
Vasantha Krishna prasad: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు. సోమవారం మైలవరం మండలం చంద్రాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమం సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
మా ఇంట్లోనే 55 ఏళ్ల రాజకీయం..
నేను పుట్టేనాటికి మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. నేను పుట్టిన రెండు మాసాలకే సర్పంచ్ అయ్యారు. నాకు రెండేళ్ల వయసున్నప్పుడే మా నాన్న ఎమ్మెల్యే అయ్యారు. ఈ రకంగా మా ఇంట్లో ఒకరకంగా 55 ఏళ్లుగా రాజకీయం నడుస్తోంది. అయితే అప్పటి రాజకీయాలకు.. ఇప్పటి రాజకీయాలకు గణనీయమైన మార్పు వచ్చింది. వసంత నాగేశ్వరరావు, పిన్నమనేని కోటేశ్వరరావు తరహా రాజకీయ నాయకుడిలాగే నేను మిగిలిపోయాను. ఈనాటి రాజకీయ నాయకులు వేగంగా ముందుకు పరుగెత్తాలంటే.. వెనకటి పెద్దరికం పనికిరాదు. పక్కన 10 మంది పోరంబోకులు ఉండాలి. వాళ్లు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ముందడగు వేసే పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితులను చూస్తే.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా, ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని అనిపిస్తుంటుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna prasad) ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేగా ఉండి కూడా సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని చెప్పారు. తాను ఎన్నికలప్పుడూ మాత్రమే రాజకీయం చేస్తానని అన్నారు. తర్వాత నన్ను గెలిపిచినవాళ్లకు ఏ విధంగా మంచి చేయాలని చూస్తానని చెప్పారు. గత మూడున్నరేళ్లలో తానెక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని.. పథకాలు ఆపలేదని చెప్పారు. కేసుల విషయంలో కొంతమంది తమ పార్టీ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చని అన్నారు.
గుంటూరులో జరిగిన టీడీపీ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై కూడా ఆయన మిగిలిన వైసీపీ నేతలకు భిన్నంగా స్పందించారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్నారైలను ఆపడం మంచి పద్ధతి కాదని, అలాంటి వారిని విమర్శించడం సరికాదని అన్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెడితే ఎన్ఆర్ఐలు ఎవరు పెట్టుబడి పెట్టేందుకు వస్తారని అన్నారు. తొక్కిసలాట ఘటనను చిలవలు, పలవలు చేసి చూడటం సరికాదని అన్నారు.
ఇవి కూడా చదవండి:
Ram Gopal Varma: కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
Director Bobby: నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్నయ్య.. పాలిటిక్స్ కు తమ్ముడు ఉన్నాడు.. డైరెక్టర్ బాబీ కామెంట్స్
Shahrukh Khan : డిల్లీ అంజలి ఘటనపై స్పందించిన షారూఖ్ ఖాన్.. కుటుంబానికి అండగా ఉంటానంటూ
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/