Last Updated:

New Mahindra Thar: తక్కువ ధరలో మహీంద్రా థార్ సరికొత్త వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..

New Mahindra Thar:  తక్కువ ధరలో మహీంద్రా థార్ సరికొత్త వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..

New Mahindra Thar: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తన ప్రతిష్టాత్మక థార్ (2023 Mahindra Thar) మోడల్ లో సరికొత్త వేరియంట్ ను మార్కెట్ లో విడుదల చేసింది. థార్ ఆర్‌డబ్ల్యూడీ (రియర్ వీల్ డ్రైవ్) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై వేరియంట్ ఆధారంగా రూ.13.49 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే ఇవి లాంచింగ్ ధరలు మాత్రమే .తొలి 10 వేల బుకింగ్స్‌ వరకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది. పెట్రోల్, డీజీల ఆప్షన్లలో ఈ మోడల్ దొరుకుతుంది.

న్యూ కలర్స్ తో..

ఈ న్యూ మోడల్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. మహీంద్రా థార్​ (2023 Mahindra Thar) 2 ​డబ్ల్యూడీలో డీ117 సీఆర్​డీఈ ఇంజిన్​ ఉంటుంది. ​ ట్రాన్స్​మిషన్​తో.. ఈ వెహికిల్​ 117 BHP పవర్​ను, 300 Nm టార్క్​ను జనరేట్​ చేస్తుంది. మహీంద్రా థార్​ 2​డబ్ల్యూడీలో mStallion 150 TGDi ఇంజిన్ కూడా ఉంది. ఇది 150 BHP పవర్​ను, 320 NM టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది. బ్లేజింగ్​ బ్రాంజ్​, ఎవరెస్ట్​ వైట్​ వంటి రెండు రంగుల్లో ఈ థార్​ లభిస్తోంది. సరికొతత్త కలర్స్​తో థార్​ లుక్​ మరింత ఆకర్షణీయంగా మారింది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్ల లో వీటిని తీసుకువచ్చారు.

పాత మోడల్‌‌కు కొత్త హంగులు

గత మోడల్ థార్ 4WD లో కంపెనీ కొన్ని మార్పులు చేసి ఈ వెర్షన్ ను తీసుకువచ్చింది కంపెనీ. అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో న్యూ మోడల్ పనిచేస్తుంది. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను ఇష్టపడే వారికి LX డీజిల్ 4WD వేరియంట్‌ల్లో ఇది అందుబాటులో ఉంటుంది. 4WD పవర్‌ట్రైన్ లైనప్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మోడల్‌లోని 2.0L ఎమ్ స్టాలిన్ 150 TGDi పెట్రోల్ ఇంజిన్‌ ద్వారా 150 bhp, 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది . 2.2L mHawk 130 డీజిల్ ఇంజన్ 130 bhtor N, 130 bh torque పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటాయి.

అదనపు ఫీచర్స్

18 అంగుళాల అలోయ్ వీల్స్,
ఆల్- టెర్రైన్ టైర్స్
ఈఎస్పీ మౌల్డ్డెడ్ ఫుట్‌స్టెప్స్‌
క్రూయిజ్ కంట్రోల్
బ్లాక్ బంపర్స్
ఎలక్ట్రిక్ ఓఆర్వీఎమ్స్
ఫాగ్ లైట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
రూఫ్- మౌంటెడ్ స్పీకర్ వంటి ఫీచర్స్ థార్ 2డబ్ల్యూడీలో ఉన్నాయి.

ప్రత్యేక ఫ్యాన్ బేస్

తక్కువ ధరకు తీసుకొస్తుండటంతో.. ఈ మహీంద్రా థార్​ 2​డబ్ల్యూడీ మోడల్​కు మంచి డిమాండ్​ ఉంటుందని మహీంద్రా అండ్​ మహీంద్రా భావిస్తోంది. తొలిసారి మహింద్రా సంస్థ థార్ వేరియంట్ కారును 2010లో వాహనదారులకు పరిచయం చేసింది. 13 ఏళ్ల నుంచి మార్కెట్ లోకి ఎన్ని లగ్జరి కార్లు వచ్చినా.. థార్ కు మాత్రం ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

ఇవి కూడా చదవండి:

అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాం : కేటీఆర్

 మీకు నాలాగ అవ్వకూడదంటూ.. వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సమంత

ఐదేళ్లు అధికారం.. ఒక్కరోజు కూడా వదులుకోం.. ముందస్తుకు వెళ్లం- సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: