Published On:

Pahalgam Terror Attack: పాతాళంలో దాక్కున్నా వదలం! రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Pahalgam Terror Attack: పాతాళంలో దాక్కున్నా వదలం! రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

 

దాడి చేసిన వారిని, చేయించిన వారిని వెతికి వెతికి వేటాడతాం

 

 

Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్ స్పందించారు. దాడిని తీవ్రంగా పరిగనించిన ఆయన దుండగులు పాతాళంలో దాక్కున్నా వదలమని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులతో పాటు 26మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దాడికి పాల్పడిన దుండగులు రోజులు లెక్కపెట్టుకోవాలని, వారి వెనకాల వుండి దాడి చేయించిన వారిని  కూడా వదలమన్నారు. బుధవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన ఆయన, లోయలోని భద్రతా పరిస్థితిని సమీక్షించారు. భారత్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నిన ప్రతి ఒక్కరిని గుర్తించి తగిన శాస్తి చేస్తామన్నారు.

 

వెళ్లి మోదీకి చెప్పుకో
మంగళవారం మధ్యాహ్నం కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచకణారహితంగా కాల్పులు జరిపారు.  కొందరి తలపై, చెవుల్లో తుపాకీని పాయింట్ బ్లాంక్ లో పెట్టిమరీ కాల్చారు. భర్తను తన కళ్లముందే చంపగా.. తనను కూడా చంపివేయాలని తీవ్రవాదిని ఆ ఇల్లాలు వేడుకుంది. అందుకు బదులుగా తాము మహిళలను చంపమని వెళ్లి ఈ విషయాన్ని మోదీకి చెప్పుకోవాలని అందులో ఒకరు బదులిచ్చారు. ఈ ఘటనలో 26మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

 

తెరవెనక కూర్చుని భారత గడ్డపై దుర్మార్గపు చర్యలకు పూనుకున్న ప్రతీఒక్కరికి సరైన సమయాన, సరైన విధంగా బుద్ధి చెబుతామన్నారు రాజ్ నాథ్‌ సింగ్. ఈ దాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబా (LoT) అనే పాకిస్తానీ సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది. తీవ్రవాదులు ఉపయోగించిన మ్యాప్ లు, టెక్నాలజీ సైనికులు వాడేవని నిఘావర్గాలు తెలిపాయి.

 

 

గుంజిమరీ కొడతాం
ఉగ్రవాదాన్ని ఎదుర్కునే విషయంలో భారత్ జీరో టోలరెన్స్ విధానాన్ని కలిగి ఉందని అన్నారు రాజ్ నాథ్. పహల్గాం దాడిపై ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి మరియు ఎయిర్ చీఫ్ మార్షల్ ఎకె సింగ్ పాల్గొన్నారు. సాయుధ దళాలు ఏ క్షణమైనా ఎటువంటి చర్యకైనా సిద్దంగా ఉండాలని పోరాటపటిమ మన సొంతమని అన్నారు.

 

అస్సలు వదలం
పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే సౌదీ అరేబియా టూర్ ను రద్దు చేసుకుని భారత్ కు తిరిగి వచ్చారు ప్రధాని మొదీ. బుధవారం ఉదయమే భారత్ కు చేరుకున్న ఆయన విమానాశ్రయంలోనే సమావేశాన్ని నిర్వహించారు. అందులో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్, పలువురు ఉన్నతాదికారులు ఉన్నారు. ఉగ్రదాడి జరిపిన వారు ఎవరైనా ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదని మోదీ అన్నారు. బాధితకుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.