Published On:

Pahalgam: ఉగ్రవాదులకు మద్దతిచ్చిన అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్

Pahalgam: ఉగ్రవాదులకు మద్దతిచ్చిన అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్ర ఘటనపై పాకిస్థాన్ తోపాటు ఉగ్రవాదులను సపోర్ట్ చేసిన అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.   దేశద్రోహం కేసు నమోదు చేశారు. పుల్వామా, పహల్గాం దాడులు ఉగ్రవాదులు చేయలేరని భారత ప్రభుత్వమే చేసిందని అన్నారు ఇస్లాం. ఇస్లాం మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

 

ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ( AIUDF) పార్టీ తరపున మూడుసార్లు  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు అమినుల్ ఇస్లాం. AIUDF పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఇస్లాంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. అతని వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని అన్నారు.

 

ఇస్లాంను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్పీ స్వప్ననీల్ చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించినందుకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై 152, 196, 197(1), 113(3), 352 మరియు 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

“అమాయక  పౌరులపై జరిగిన దాడిని నీరుగార్చేందుకు చూస్తే సహించేది లేదు. భావప్రకటనా స్వేచ్చను దుర్వినియోగం చేస్తూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని వదిలిపెట్టేదిలేదు” అని అస్సాం సీఎం హెమంత బిశ్వ శర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన 26 బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

 

పహల్గాంలో ఏప్రిల్ 21న జరిగిన దాడిలో 26మంది టూరిస్టులను తీవ్రవాదులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బలగాలు తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశాయి. దాడిలో పాల్గొన్న వారిలో ఒకరిని ఇప్పటికే ఎన్ కౌంటర్ చేశారు.