Ananya Nagalla Pays Tribute: ‘మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను’.. అనన్య ఎమోషనల్

Ananya Nagalla Pays Tribute to the person who died in the Pahalgam Terror Attaack: అచ్చ తెలుగందం అనన్య నాగళ్ళ ప్రస్తుతం హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి కష్టపడుతుంది. మల్లేశం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలనుఅందుకుంది . ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ తో అమ్మడు మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తనకు అందివచ్చిన అవకాశాలను వదలకుండా ఒడిసిపట్టుకుంటూ హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో సైతం అందాలను ఆరకొస్తూ.. ఎక్స్ పోజింగ్ కూడా సై అని చెప్పుకొస్తుంది.
సినిమాల విషయం పక్కన పెడితే.. సామజిక సేవలో కూడా అనన్య ఎప్పుడు ముందు ఉంటుంది. సమాజంలో ఎలాంటి ఘటనలు జరిగిన ఆమె స్పందిస్తూ ఉంటుంది. తాజాగా పహాల్గమ్ ఉగ్రదాడి.. దేశానికి ఎంత విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెల్సిందే. 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపేశారు. ఆ ఉగ్రదాడిలో నెల్లూరు పక్కన ఉన్న కావలికి చెందిన మధుసూదన్ రావు అనే వ్యక్తి కూడా మరణించాడు. నేడు నెల్లూరులో షూటింగ్ కోసం వెళ్లిన అనన్య.. మధుసూదన్ రావు మృతదేహానికి నివాళులు అర్పించడానికి కావలి వెళ్ళింది. ఈ విషయాన్నీ ఆమె ఎక్స్ లో అభిమానులతో షేర్ చేసుకుంది.
“పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను… ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను… మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను.
శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక అనన్య చేసిన పనికి నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరిలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వదిలేయకుండా.. వారి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లిన అనన్య మనసు ఎంతో మంచిదని ప్రశంసిస్తున్నారు.
పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను… ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను… మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని నేను తిసుకోలేకపోతున్నాను..
శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి… pic.twitter.com/q2ZuMj2G8M
— Ananya Nagalla (@AnanyaNagalla) April 24, 2025