Last Updated:

Bangalore traffic lights: బెంగళూరులో హార్ట్ సింబల్ ట్రాఫిక్ లైట్లు.. ఎందుకుంటే..

బెంగళూరులోని పలు ట్రాఫిక్ లైట్లలో హార్ట్ సింబల్ కనిపించడంతో ప్రయాణికులు ఇటీవల ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే, మరికొందరు కర్నాటక రాజధానిలో ఎర్రటి ట్రాఫిక్ లైట్లు ఒక్కసారిగా గుండె ఆకారంలో ఎందుకు మెరుస్తున్నాయని ఆశ్చర్యపోయారు.

Bangalore traffic lights: బెంగళూరులో హార్ట్ సింబల్ ట్రాఫిక్ లైట్లు.. ఎందుకుంటే..

Bangalore: బెంగళూరులోని పలు ట్రాఫిక్ లైట్లలో హార్ట్ సింబల్ కనిపించడంతో ప్రయాణికులు ఇటీవల ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే, మరికొందరు కర్నాటక రాజధానిలో ఎర్రటి ట్రాఫిక్ లైట్లు ఒక్కసారిగా గుండె ఆకారంలో ఎందుకు మెరుస్తున్నాయని ఆశ్చర్యపోయారు.

గుండె ఆకారపు ట్రాఫిక్ లైట్లు మణిపాల్ హాస్పిటల్స్, బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ మరియు బృహత్ బెంగళూరు మహానగర పాలికే కలిసి ఏర్పాటు చేసాయి. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సను త్వరితగతిన అందిస్తారు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగించడానికి నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్లలో క్యూఆర్ కోడ్‌లు కూడా పోస్ట్ చేయబడ్డాయి. బెంగళూరు నివాసితులు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అత్యవసర సేవలను పొందగలుగుతారు. బెంగుళూరును ‘హార్ట్ స్మార్ట్ సిటీ’గా ప్రోత్సహించడానికి ప్రపంచ హృదయ దినోత్సవం రోజున గుండె ఆకారపు ట్రాఫిక్ లైట్లు ఏర్పాటు చేయబడ్డాయి.” నగరంలో 20కి పైగా చోట్ల ఈ ట్రాఫిక్‌ లైట్లు వెలిసాయి.

ఈ కార్యక్రమం కింద నగరంలో గుండె ఆరోగ్యం పై అవగాహన కల్పించే ఆడియో సందేశాలను కూడా ప్లే చేశారు. క్యూఆర్ కోడ్‌ల వల్ల వినియోగదారులు అత్యవసర సేవలను డయల్ చేయడానికి బదులుగా సులభంగా పొందవచ్చని మణిపాల్ హాస్పిటల్స్ తెలిపింది. ఒకే క్లిక్‌తో, అంబులెన్స్ సేవలు దొరుకుతాయి.గుండె ఆకారపు ట్రాఫిక్ సిగ్నల్ ప్రతి ప్రాణం ముఖ్యమని సూచించడానికి ఉంచబడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఎవరూ వేగంగా డ్రైవ్ చేయకూడదు మరియు సిగ్నల్స్ జంప్ చేయకూడదు. ప్రజలు అప్రమత్తంగా, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఇది కాకుండా, వారి ప్రియమైనవారు వారు ఇంటికి తిరిగి వచ్చేవరకు వేచి ఉంటారని మరియు అన్ని భద్రతా చర్యలను అనుసరించాలని కూడా ఇది సూచిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి: