Last Updated:

Satya Nadella : మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల కు చాట్ రోబో క్షమాపణ… ఎందుకో తెలుసా?

కృత్రిమ మేధతో తయారైన చాట్ రోబో మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల కు క్షమాపణ చెప్పింది. దీనికి కారణం ఏమిటంటే బిర్యానీని టిఫిన్ గా పేర్కొనడమే.

Satya Nadella : మైక్రోసాఫ్ట్ చైర్మన్  సత్య నాదెళ్ల కు చాట్ రోబో క్షమాపణ… ఎందుకో తెలుసా?

Satya Nadella : కృత్రిమ మేధతో తయారైన చాట్ రోబో మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల కు క్షమాపణ చెప్పింది. దీనికి కారణం ఏమిటంటే బిర్యానీని టిఫిన్ గా పేర్కొనడమే. దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందే అల్పాహారం(టిఫిన్) పేర్లు చెప్పాలని సత్య నాదెళ్ల అడిగినపుడు చాటీ పీటీ ఇడ్లీ, వడ, దోశెలతో పాటు బిర్యానీని కూడా ఆ జాబితాలో చేర్చింది. దీనిపై సత్య నాదెళ్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు.

బిర్యానీని దక్షిణాది టిఫిన్ గా పేర్కొనడం ద్వారా హైదరాబాద్ కు చెందిన తన తెలివితేటలను అవమానించొ ద్దని ఆయన చాట్ జీపీటీకి సూచించారు. ఈ విషయంలో తనకు తరువాత “సారీ” చెప్పిందని నాదెళ్ల తెలిపారు. తరువాత ఇడ్లీ, దోశల్లో ఏది మంచిదనే దానిపై ఒక నాటకాన్ని సృష్టించా లని ఆయన కోరారు. పిండికి సాహిత్యాన్ని జోడిస్తూ షేక్స్పియర్ నాటకంలో భాగంగా ఒక సంభాషణ రూపొందించాలని చాట్ జీపీటీకి సూచించారు.

బెంగళూరులో జరిగిన ప్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్ లో ఇండియాలో కొనసాగుతున్న అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ ఆవిష్కరణల గురించి సత్య నాదెళ్ల ప్రెజెంటేషన్ ఇచ్చారు. టెక్నాలజీ మన జీవితాలను ఏవిధంగా ప్రభావితం చేస్తోందో ఆయన వివరించారు.ఈ సందర్బంగా పై సంబాషణ జరిగింది.

ఇవి కూడా చదవండి: