Last Updated:

విజయవాడ: ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదు.. తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు

ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదంటూ తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంఘం డైరీ విడుదల చేశారు.

విజయవాడ: ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదు.. తమిళనాడు మాజీ సీఎస్  రామ్మోహన్ రావు

Vijayawada: ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదంటూ తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంఘం డైరీ విడుదల సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు రిజర్వేషన్ ఇవ్వరని ఇచ్చినా వాటివల్ల ఉపయోగం లేదని అన్నారు. తాను ముద్రగడ పద్మనాభంతో కాపులకు రిజర్వేషన్ కావాలంటూ పోరాటం చేయవద్దని చెప్పానని అన్నారు. రిజర్వేషన్ కావాలన్న డిమాండ్ తో కాపులు బీసీలకు వ్యతిరేకమయ్యారని అన్నారు.

కాపులకు రాజ్యాధికారం లేదని ఎక్కడా చెప్పొద్దని రామ్మోహన్ రావు అన్నారు. ఏపీలో 35 మంది వరకు కాపులు ఎమ్మెల్యేలుగా వున్నారని ఆయన గుర్తుచేశారు. ఒకే సామాజికవర్గానికి చెందినవాళ్లు ఏపీ నుంచి ముగ్గురు సుప్రీంకోర్ట్ జడ్జిలయ్యారని.. వారికేం రిజర్వేషన్లు వున్నాయని రామ్మోహన్ రావు ప్రశ్నించారు. కాపుసంఘాలన్నీ రాజకీయాలు వదిలేసి అభివృద్దిచెందడానికి కృషి చేయాలి. కాపుల్లో నువ్వు పెద్దా.. నేను పెద్దా అన్న పంతాలతో ఎదగలేకపోయింది. బీసీ రిజర్వేషన్ వల్ల కాపులకు ఉపయోగం లేదు. ఆర్దికంగా బలంగా లేకపోతే రాజకీయంగా ఎదగలేరు. 20 శాతం రిజర్వేషన్ ఉన్న కులాలు రాజకీయంగా ఏమీ ఎదగలేదని ఆయన గుర్తు చేసారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని తెలిపింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర జాబితాలో వున్న కాపులకు రిజర్వేషన్ల కల్పనలో తమ పాత్ర లేదని తెలిపింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు .. ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్రం వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం చట్టాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: