Home / Vijayawada
AP Metro Rail Project: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల మొదటి విడత డీపీఆర్లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో తొలి దశలో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4కి.మీల మేర ఒకటో కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు (5.08కి.మీల మేర) రెండో కారిడార్, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీల మేర) మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. […]
విజయవాడలో దారుణం జరిగింది. చదువుకుంటోన్న కుమార్తె జోలికి రావొద్దని హెచ్చరించడమే పాపమైంది. నడిరోడ్డుపై కిరాతకంగా నరికి ప్రాణాలు తీశాడు. నిన్నరాత్రి పొద్దుపోయాక ఈ దారుణం జరిగింది. కుమార్తె కళ్లెదుటే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
విజయవాడ గురునానక్ నగర్ లో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కలకలం రేపింది. వీరిలో డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి లోపల శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8) విగత జీవుల్లా కనిపించారు. ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.
విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో విజయవాడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా అధికార వైసీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నా అవసరం పార్టీకి లేదని భావించిన తర్వాత కూడా.తాను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలని పొగుడుతున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన కేశినేని నాని విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా ఫర్వాలేదని, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గానైనా గెలుస్తానేమోనని అన్నారు.
సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచించారు. ఇప్పటి పిజ్జా, బర్గర్స్ ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు.