Last Updated:

Skype: స్కైప్ సేవలకు బ్రేక్.. ఇక వీడియో కాల్స్ లేనట్టేనా?

Skype: స్కైప్ సేవలకు బ్రేక్.. ఇక వీడియో కాల్స్ లేనట్టేనా?

Microsoft to discontinue Skype from May: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2003లో ఆవిర్భవించిన స్కైప్‌ సేవలు నిలిపివేయనుంది. ఈ విషయాన్ని స్కైప్ యాజమాన్య సంస్థ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇందులో భాగంగానే మే 5వ తేదీ నుంచి స్కైప్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే ప్రపంచానికి వీడియో కాన్ఫరెన్సింగ్ పరిచయం చేసిన స్కైప్ త్వరలో మూతపడుతుందని తెలియడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ప్రముఖ టెక్ బ్లాగ్ ఎక్స్‌డీఏ ప్రకారం.. స్కైప్ ప్రివ్యూలో ఓ మెసేజ్ హిడెన్‌లో కనిపించిందని, అందులో మే నుంచి స్కైప్ సేవలు షట్ డౌన్ అవుతుందని ఉందరని చెప్పింది. అలాగే కాల్స్, వీడియో కాల్స్, ఛాటింగ్ వంటి కోసం మైక్రోసాఫ్ట్ టీం ఉందని, అందుకే చాలామంది టీంకు మారినట్లు ఉందని పేర్కొంది. ఈ ప్లాట్ ఫాంను 2011లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ విషయంపై అధికారిక ప్రకటన వెల్లువడలేదు.

22 ఏళ్లుగా స్కైప్ ఆన్‌లైన్ కమ్యూనికేషన్‌లో సుదీర్ఘకాలం సేవలు అందించింది. అలా నంబర్ వన్ స్థానంలో ఉన్న స్కైప్‌ను మూసివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ పలు కీలక సూచనలు చేసింది. మెసేజింగ్, వీడియూ కాల్స్ కోసం ఇష్టపడే ప్లాట్‌ఫామ్ అయినటువంటి మైక్రోసాఫ్ట్ టీమ్స్‌రే మారాలని కోరుతోంది.

ఇక, స్కైప్ ఫ్లాట్‌ఫామ్‌కు 2010లో అత్యధికంగా 660 మిలియన్ల మంది యూజర్లు ఉండగా.. 2015 నాటికి నెలవారీ యూజర్లు 300 మిలియన్లకు తగ్గిపోయారు. మళ్లీ 2020 మార్చి నాటికి సుమారు 100 మిలియన్లకు తగ్గింది. అయితే 2011లో స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయగా.. తర్వాత మైక్రోసాఫ్ట్ టీమ్స్ బిజినెస్ అండ్ పర్సనల్ కమ్యూనికేషన్ వంటి వివరాలను అందించింది.

ఇదిలా ఉండగా, మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను త్వరలో మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల కావడంతో కొంతమంది సోషల్ మీడియా వేదికగా మీమ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు.