Published On:

Telangana: రాష్ట్రానికి కొత్త డీజీపీలు.. రేసులో ఎవరున్నారంటే?

Telangana: రాష్ట్రానికి కొత్త డీజీపీలు.. రేసులో ఎవరున్నారంటే?

Telangana sents eight names to upsc for next dgp post: తెలంగాణ డీజీపీ రేసులో పలువురు సీనియర్ ఐపీఎస్‌లు ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మంది పేర్లతో యూపీఎస్సీకి జాబితా పంపింది. అయితే అర్హతల ఆధారంగా ముగ్గురి పేర్లు సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపనుంది. ఇందులో ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న జితేందర్.. ఈ ఏడాది సెప్టెండర్ 6న పదవీ విరమణ పొందనున్నారు. కాగా, రవిగుప్తా, సీవీ ఆనంద్, ఆప్టే వినయక్ ప్రభాకర్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, బి.శివధర్ రెడ్డి, డాక్టర్ సౌమ్య మిశ్రా, శిఖాగోయల్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది.

 

ఇందులో 1990 బ్యాచ్‌కు చెందిన రవి గుప్తా, 1991 బ్యాచ్‌లో సీవీ ఆనంద్, 1992 బ్యాచ్‌లో డాక్టర్ జీవీ జితేందర్, 1994 బ్యాచ్‌లో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆప్టే వినాయక్ ప్రభాకర్, బి.శివధర్ రెడ్డి, డాక్టర్ సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు. అయితే ఇందులో నుంచి ముగ్గురు పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా.. అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకరిని డీజీపీగా నియమించనుంది.

 

అయితే, రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపిన ఎనిమిది మందిలో ప్రస్తుతం ఉన్న డీజీపీ జితేందర్ సెప్టెంబర్ 6వ తేదీన రిటైర్మెంట్ కానున్నారు. అలాగే, హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 5వ తేదీన రిటైర్ కానుండగా.. ఆ తర్వాత వరుసగా రవి గుప్తా డిసెంబర్ 19వ తేదీన రిటైర్ కానున్నారు. ఇక, వచ్చే ఏడాది 2026 ఏప్రిల్‌లో బి.శివధర్ రెడ్డి రిటైర్ కానుండగా.. 2027 డిసెంబర్‌ 30వ తేదీన డాక్టర్ సౌమ్య మిశ్రా, 2028 జూన్‌లో సీవీ ఆనంద్ రిటైర్ కానున్నారు. అదే విధంగా 2029లో ఆప్టే వినాయక్ ప్రభాకర్‌తోపాటు 2029 మార్చి వరకు శిఖాగోయల్ సర్వీసులో ఉండనున్నారు.

 

అయితే, ప్రస్తుతం ఆ ముగ్గురు లిస్టులో ఈ పేర్లు వినిపిస్తున్నాయి సీవీ ఆనంద్‌తో పాటు బి.శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రాలలో ఒకరికి డీజీపీ పదవి దక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకవేళ సౌమ్య మిశ్ర పేరు వస్తే.. రాష్ట్రంలో తొలి మహిళా డీజీపీగా రికార్డుకెక్కనున్నారు.