Published On:

Tata EV Discounts: భలే డిస్కౌంట్స్ బాస్.. అతి తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. ఇదే బెస్ట్ టైమ్..!

Tata EV Discounts: భలే డిస్కౌంట్స్ బాస్.. అతి తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. ఇదే బెస్ట్ టైమ్..!

Tata EV Discounts: టాటా తన అమ్మకాలను పెంచుకోవడానికి ఈ నెలలో పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, టియాగో ఈవీలపై భారీ తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తుంది. MY2025 స్టాక్‌పై ఆఫర్‌లు గత నెల నుండి కొనసాగుతున్నాయి. కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీలపై మాత్రమే ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్, లాయల్టీ బోనస్‌లను అందిస్తున్నారు. ఏ మోడల్‌పై ఎంత ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Tata Curvv EV
కర్వ్ ఎలక్ట్రిక్ (MY2024) లోని కొన్ని యూనిట్లు ఇప్పటికీ డీలర్ల వద్దే ఉన్నాయి. స్టాక్ క్లియర్ చేయడానికి చాలా మంచి తగ్గింపు అందిస్తున్నారు. ఈ డిస్కౌంట్‌లో రూ. 90,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 50,000 లాయల్టీ బోనస్ కూడా ఉన్నాయి. కర్వ్ ఎలక్ట్రిక్ ధర రూ. 17.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 502 కిలోమీటర్ల వరకు రేంజ్‌ని అందిస్తుంది.

 

Tata Nexon EV
గత సంవత్సరం నుండి మిగిలిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ స్టాక్‌పై డీలర్‌షిప్ ద్వారా రూ. 1.40 లక్షల తగ్గింపు లభిస్తుంది. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేస్తే 489 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. నెక్సాన్ ఎలక్ట్రిక్ ధర రూ. 12.49 లక్షల నుండి రూ. 17.19 లక్షల వరకు ఉంటుంది. దీనికి భద్రత పరంగా 5 స్టార్ రేటింగ్ లభించింది.

 

Tata Tiago EV
ఈ నెలలో టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తే, ఈ కారుపై రూ.1.30 లక్షల డిస్కౌంట్ పొందచ్చు. ఈ కారు పాత స్టాక్ పై ఈ డిస్కౌంట్ ఉంది. టియాగో ఈవీ ధరలు రూ. 7.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 250–315 కి.మీ.లు నడుస్తుంది.

 

Tata Punch EV
ఈ నెలలో, టాటా పంచ్ ఎలక్ట్రిక్ పాత స్టాక్‌పై రూ.1.30 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ సంవత్సరం మోడల్‌‌పై రూ. 50,000 వరకు మాత్రమే ఆఫర్ ఇస్తున్నారు. పంచ్ ఈవీ పూర్తిగా ఛార్జ్ చేస్తే 315 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ కారు ధర రూ. 9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.