Sugar Control Tips: షుగర్ లెవల్స్ పై చింత వద్దు.! ఇంట్లోనే ఇలా కంట్రోల్ చేసుకోండి!

- షుగర్ లెవల్స్ పెరిగిందని చింత వద్దు
- ఇంట్లోనే ఇలా కంట్రోల్ చేసుకోండి
Sugar Control Tips: షుగర్ వ్యాధి అంటేనే వెన్నులో వణుకు పడుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఇచ్చిన నివేధిక ప్రకారం, దేశవ్యాప్తంగా 10కోట్ల మంది ప్రజలు షుగర్ వ్యాధికి గురయ్యారు. 15శాతం మంది ప్రి డయాబెటిక్ తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర కంటెంట్ ఎక్కువైనప్పుడు షుగర్ వ్యాధికి గురవుతారు. ముఖ్యంగా తినే ఆహారపదార్ధాలలో చెక్కర శాతం ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.

exersixe for sugar patients
చక్కర వ్యాధిని కంట్రోల్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దాదాపు 30 నిమిషాలపాటు కఠినమైన వ్యాయామాన్ని ఆచరించాలి. అలవాటు లేని వాళ్లు 5నిమిషాల నుంచి పెంచుతూపోవాలి. తినే ఆహారంలో చెక్కర, ఉప్పు శాతం తక్కువగా ఉండాలి. షుగర్ వచ్చిన వాళ్లు జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. బరువు తగ్గడం ఎంతో ఉత్తమం.
తక్కువ తినడమే షుగర్ తగ్గడానికి ముఖ్య కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ అది సరైనది కాదు. ముఖ్యంగా తినే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్, ఉండేలా చూసుకోవాలి. తగినంత ప్రోటీన్ శరీరానికి అందాలి. కొలిచి తింటే మరీ మంచిది. ఉదాహరణకు 70కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు 56గ్రాముల ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ ను శనగలు, మినుములు, కందులు, పెరుగు ద్వారా పొందవచ్చు.

minumulu for sugar control
తెల్లని పొట్టు తీసేసిన అన్నాన్ని బదులుగా జొన్న, సజ్జ, రాగి, మిల్లెల్ట్స్, ముడి బియ్యంతో చేసిన వాటిని ఆహారంగా తీసుకోవాలి. ఇవి శరీరానికి తక్కువ షుగర్ ను అందిస్తాయి. వీటితో కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ, గోంగూర ముల్లంగి వాటిని తీసుకోవడం వలన షుగర్ ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. పాలతో చేసిన టీ బదులు ప్రతీ రోజు గ్రీన్ టీ అలవాటు చేసుకోవాలి.

jonna rotte
షుగర్ తో బాధపడేవారు ఫ్రై (Fry) చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. ప్యాకెట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఉదాహరణుకు బ్రెడ్, వైట్ రైస్.
ప్రతీ ఒక్కరు కనీసం 15 నుంచి 30 నిమిషాల వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆరోగ్యకరమైన ఇన్సులిన్ ను శరీరం పొందుతుంది. గ్లూకోజ్ లెవల్స్ బాగుంటాయి. ఉదయం లేక సాయంత్రం యోగా, వాకింగ్ లాంటివి చేయండి.
గమనిక: ఇవి కేవలం ఇంట్లో చేసుకునే చిన్నపాటి చిట్కాలు, మీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించండి. డాక్టర్ సూచించిన మందులను వాడుతూ పై చిట్కాలు పాటించండి. పై చిట్కాలు ఆరోగ్యంపై అవగాహన కోసమే అందించడం జరిగింది. ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించండి.