Last Updated:

Governor Tamilsai: విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు పై చర్చిందాం.. మంత్రి సబితకు గవర్నర్ తమిళి సై లేఖ

తెలంగాణలో ప్రభుత్వానికి-గవర్నర్ కు మద్య దూరం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రజా జీవితంతో ముడిపడిన కీలక బిల్లులు రాజ్ భవన్ కార్యాలయంలో టేబుల్ కే పరిమితమైనాయి. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఏకంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి లేఖ రాశారు.

Governor Tamilsai: విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు పై చర్చిందాం.. మంత్రి సబితకు గవర్నర్ తమిళి సై లేఖ

Hyderabad: తెలంగాణలో ప్రభుత్వానికి-గవర్నర్ కు మద్య దూరం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రజా జీవితంతో ముడిపడిన కీలక బిల్లులు రాజ్ భవన్ కార్యాలయంలో టేబుల్ కే పరిమితమైనాయి. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఏకంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి లేఖ రాశారు. రాజ్ భవన్ వచ్చి విశ్వ విద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై చర్చించాలని గవర్నర్ తమిళి సై సూచించారు. ఇదే బిల్లుపై అభిప్రాయం కోరుతూ యూజీసీకి సైతం గవర్నర్ లేఖ వ్రాశారు.

తెలంగాణ శాసనమండలి ఆమోదం చేసిన 7 బిల్లుల్లో కీలకమైనది విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు కూడా ఒకటి. ఇది గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు, అధ్యాపకుల భర్తీని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం ఆ బిల్లు పెండింగ్ లో ఉండడంతో నియమకాలు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఇటీవల విద్యార్ధి సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు ఆమోదం పై ఒత్తిడి వస్తోంది. రెండు రోజుల్లో బిల్లు ఆమోదించకపోతే రాజ్ భవన్ ముట్టడిస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్ధి ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం, యూజీసికి లేఖ రాశారు.

వాస్తవంలోకి బిల్లు న్యాయపరమైన అంశాలతో ఆగిపోయింది. సమస్యలు ఏమైనా వస్తాయా? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. గత మూడేళ్లగా ఖాళీలను భర్తీ చేయాలని పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. 8సంవత్సరాలుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీల పూరింపుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాజాగా ఉమ్మడి నియామక బోర్డు తీసుకొని రావడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని, నియమకాలు ఆలస్యం అవుతాయని గవర్నర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేగాకుండా విశ్వవిద్యాయాలు దెబ్బ తింటాయని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని విద్యాశాఖ మంత్రి హోదాలో వచ్చి బిల్లుపై చర్చించాలని గవర్నర్ తమిళిసై సైచించారు.

రాజకీయాల నేపథ్యంలో ప్రభుత్వం గవర్నర్ వ్యవస్ధను సరిగా పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ సమావేశాలు సైతం గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో గత కొంతకాలంగా ప్రభుత్వం వర్సస్ రాజ్ భవన్ అన్నట్లుగా సాగుతోంది.

ఇది కూడా చదవండి: TRS Party: పార్టీ పేరు మారుస్తున్నాం…అభ్యంతరాలుంటే తెలపండి… తెరాస బహిరంగ ప్రకటన

ఇవి కూడా చదవండి: