Home / Governor Tamilisai
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. సైబర్ క్రైమ్ పోలీసులకు గవర్నర్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయినట్లు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆమె ట్వీట్ ప్లాట్‌ఫారమ్ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని, ట్విట్టర్ సపోర్ట్ నుండి గవర్నర్‌కు కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఆమె ఖాతాలో అనుమానాస్పద కార్యాచరణ ప్రారంభమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఇద్దరిని తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తమిళిసై అంగీకరించలేదు.
టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కలిసి పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలానే ఈ కార్యక్రమంలో మంత్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో అట్‌హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నేడు చివరి రోజు అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించింది.
తెలంగాణ సచివాలయం ఏప్రిల్ 30 న వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళ సై ను ఆహ్వానించకపోవడంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశిస్తూ ట్విటర్ సాక్షిగా విమర్శలు చేశారు.
గవర్నర్ తమిళిసై పై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులు ఆమోదించకపోవడంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు చీఫ్ సెక్రటరీ. రిట్ పిటిషన్లో ప్రతివాదిగా తెలంగాణ గవర్నర్ తమిళి సై పేరును ప్రస్థావించారు.
‘నా శరీరం గురించి కొంతమంది అదే పనిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నల్లగా ఉన్నానని, నదురు బట్టతల లాగా ఉంటుందని ఎగతాళిగా చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు