KTR: కేసీఆర్.. తెలంగాణ కారణజన్ముడు.. మళ్లీ సీఎం కావాలన్నదే ప్రజల ఆకాంక్ష

Birthday Celebrations at Telangana Bhavan: తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ 71 వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు 71కిలోల భారీ కేక్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ కట్ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కారణజన్ముడు కేసీఆర్ అని అన్నారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రలు ఆకాంక్షిస్తున్నారన్నారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు గట్టిగా పనిచేద్దామని తెలిపారు. రానున్న మూడున్నరేల్లు 60 లక్షల గులాబీ దండు.. ఇదే లక్ష్యంతో ముందుకెళ్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అంతకుముందు, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు పార్టీ నేతలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకే కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణకు నాన్న హీరో కావడం తన అదృష్టమన్నారు. కేసీఆర్ సాధించన వాటిలో కొంతైనా చేరుకోవాలన్నదే తన ఆశ అన్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు. తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం.. కేసీఆర్ అన్నారు. తనకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి, చరితార్థుణ్ణి చేశారని హరీశ్ రావు ట్వీట్ చేశారు.