Published On:

KTR : జిమ్‌ చేస్తూ గాయపడ్డ కేటీఆర్‌.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు

KTR : జిమ్‌ చేస్తూ గాయపడ్డ కేటీఆర్‌.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు

BRS Leader KTR Injured While Doing Gym Details Here : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గాయపడ్డారు. జిమ్‌ వర్కవుట్‌ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. వైద్యులు కొన్నిరోజులపాటు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని సూచించారని, త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ఓ పోస్టు ఉంచారు. ఇదిలా ఉంటే, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేటీఆర్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే.

 

హైకోర్టులో ఊరట..
కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రేవంత్ ఢిల్లీకి రూ.2,500కోట్లను పంపించారని కేటీఆర్‌ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేత శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును కొట్టేయాలని కేటీఆర్‌ పిటిషన్ వేశారు. ఇరువైపులా వాదనలు విన్నజస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం కేసును కొట్టేస్తున్నట్లు సోమవారం తీర్పునిచ్చింది.

 

 

ఇవి కూడా చదవండి: