Published On:

KTR : కాంగ్రెస్‌కు బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా..? రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్

KTR : కాంగ్రెస్‌కు బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా..? రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్

KTR fires Revanth government : కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం పేదల ఇళ్లు కూల్చుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ విధానంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. వరంగల్‌లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలనా అంటూ విరుచుకుపడ్డారు.

 

రాహుల్ సమాధానం చెప్పాలి..
వరంగల్‌లో దారి వెంట ఇళ్ల ధ్వంసంపై మండిపడ్డారు. కూల్చివేతలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశాడు. దీనికి సంబంధించిన రాహుల్‌కు పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అమానవీయ చర్యలపై రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘హల్ రాహుల్ గాంధీ, బుల్డోజర్ కంపెనీలతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉన్నదా అని ప్రశ్నించారు. ప్రతిరోజూ పేదల ఇళ్లతోపాటు వారి జీవితాలపై దాడి చేయడం ఏమిటి అని మండిపడ్డారు. అందాల పోటీల కోసం పేదవారి ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలనా అంటూ ఫైర్ అయ్యారు. పేద ప్రజల జీవితాలు రాక్షస బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఫైర్ అయ్యారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్న సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: