Last Updated:

Munugode MLA: మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.

Munugode MLA: మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Hyderabad: మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. శాసనసభ భవనంలోని సభాపతి గారి చాంబర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై 10,309 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయంతో నల్గొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించినట్లయింది. హుజూర్ నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడంతో జిల్లాలో ఉన్న 12 ఎమ్మెల్యే స్దానాలు టీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి.