Gali Janardhan Reddy : జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించండి : సీబీఐ కోర్టులో గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్

Gali Janardhan Reddy : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతడిని చంచల్‌గూడకు తరలించారు. జైల్లో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంచల్‌గూడ జైలులో తనకు సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.